లాక్ డౌన్ పరిష్కారం కాదు…కరోనాకి అతిపెద్ద ఆయుధం అదే : రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 16, 2020 / 08:42 AM IST
లాక్ డౌన్ పరిష్కారం కాదు…కరోనాకి అతిపెద్ద ఆయుధం అదే : రాహుల్

ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చాలా విషయాల్లో తాను విభేధిస్తానని,కానీ ఫైట్ చేయడానికి ఇది సరైన సమయం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదని,లాక్ డౌన్ అనేది ఓ పాస్ బటన్ లాంటిదని రాహుల్‌ అన్నారు. గురువారం(ఏప్రిల్-16,2020)ఢిల్లీలోని ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి ఆయన వీడియోకాల్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుంది..ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశముందన్నారు. కరోనాతో పోరాటానికి వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలని సూచించారు. ప్రస్తుతం వ్యూహాత్మకంగా వైద్య పరీక్షలు జరగట్లేదని రాహుల్ తెలిపారు. ర్యాండమ్‌ పద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించాలి. అదే కరోనాపై అతిపెద్ద ఆయుధమని రాహుల్ తెలిపారు. మన టెస్టింగ్ రేటు 10లక్షలమందికలో 199గా ఉందన్నారు.

కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్థంగా కరోనాను కట్టడి చేస్తున్నారన్నారు. వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోందని రాహుల్ అన్నారు. కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలన్నారు.ప్రస్తుతం మనం అత్యవసర పరిస్థితిలో ఉన్న స్థాయికి చేరుకున్నామని, కరోనాపై భారత్ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.(ఈ బాలీవుడ్ భామల సూపర్ లగ్జరీ కార్లు చూశారా?)

పరిపాలనా యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రాలకు కేంద్రం ఆర్థికసాయం చేయాల్సిన అవసరముందని రాహుల్ అన్నారు. రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధిలేక  ఇబ్బంది పడుతున్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రణాళికలు రచించాలన్నారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలి. తొలుత పేదలు, కూలీల ప్రాణాలు కాపాడాలన్నారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలని రాహుల్‌ సూచించారు.(అయ్యో, బీరు అనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి మృతి)