లాక్ డౌన్ టైంలో పెళ్ళి …మాస్టర్ ప్లాన్ వేసిన కుటుంబం క్వారంటైన్ కు తరలింపు

  • Published By: Mahesh ,Published On : April 30, 2020 / 12:34 PM IST
లాక్ డౌన్ టైంలో పెళ్ళి …మాస్టర్ ప్లాన్ వేసిన కుటుంబం క్వారంటైన్ కు తరలింపు

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే ప్రజలు అన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని ఒక ముస్లి కుటుంబం మాత్రం పెళ్లి కోసం  మాస్టర్ ప్లాన్ వేసి…. చివరికి పోలీసులకు చిక్కి క్వారంటైన్ లోకి వెళ్ళింది. 

పెళ్ళి ముఖ్యం
ఉత్తర ప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన అహ్మద్ అనే వ్యక్తికి ఢిల్లీకి  చెందిన ఒక యువతితో వివాహాం నిశ్చయమయ్యింది.  లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఎక్కడికి వెళ్లలేని పరిస్ధితి ఉంది.  పెళ్లి రోజు దగ్గర పడుతుండటంతో పెళ్లి కొడుకు, అతడి తండ్రి ఢిల్లీ వెళ్లేందుకు సిధ్ధమయ్యారు. నాలుగు రోజుల క్రితం ముజఫర్ నగర్ నుంచి ఢిల్లా వెళ్లేందుక బయలు దేరి మార్గ మధ్యలో పోలీసులకు చిక్కారు.పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. 

ఢిల్లీ వెళ్లటానికి మాస్టర్ ప్లాన్ 
ఇంటికి చేరిన తండ్రీ కొడుకులు మళ్లీ ప్లాన్ వేశారు.ఈ సారి పోలీసులకు దొరక్కూడదనుకున్నారు. ఇద్దరూ కల్సి మాస్టర్ ప్లాన్ వేశారు.  తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని అంబులెన్స్ కు కాల్ చేశాడు. అంబులెన్స్ అయితే ఎవ్వరూ ఆపరనే అయిడియాతో. అంబులెన్స్ రాగానే తండ్రికి తోడుగా వస్తానంటూ అహ్మద్ కూడాఎక్కాడు. లాక్ డౌన్ లో అంబులెన్స్ లకు సడలింపు ఉండటంతో ఎక్కడా వారిని పోలీసులు అడ్డగించలేదు.  ఢిల్లీకి వెళ్లాక వారు ఆస్పత్రికి వెళ్ళకుండా పెళ్లి కూతురు ఇంటికి వెళ్లారు.  అనుకున్న సమయానికి పెళ్లి చేసుకుని పోలీసుల కళ్లు కప్పి ముజఫర్ నగర్, ఖతౌలి లోని ఇంటికి చేరుకున్నారు. 

దొరికిపోయింది ఇలా..
ఖతౌలిలో ఇటీవల కోవిడ్  పాజిటివ్ కేసులు పెరగటంతో ఆ ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించారు.  అహ్మద్ ఇంట్లో జనాలు ఎక్కువ కనిపించటంతో స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటికి చేరుకుని విచారించగా అసలు విషయం  బయట పడింది.  దీంతో  నవ దంపతులతో పాటు బంధువులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ సెంటర్ కు తరలించారు.