మాకు అచ్చే దిన్: పోలీసులకు వీక్లీ ఆఫ్

కొత్త కొత్త నిర్ణయాలతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు పోలీసులకి వీక్లీ ఆఫ్(వారంలో ఒక రోజు సెలవు) మంజూరు చేసింది.

  • Published By: venkaiahnaidu ,Published On : January 4, 2019 / 07:30 AM IST
మాకు అచ్చే దిన్: పోలీసులకు వీక్లీ ఆఫ్

కొత్త కొత్త నిర్ణయాలతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు పోలీసులకి వీక్లీ ఆఫ్(వారంలో ఒక రోజు సెలవు) మంజూరు చేసింది.

కొత్త కొత్త నిర్ణయాలతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా కమల్ నాథ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అందరు పోలీసులకి వీక్లీ ఆఫ్(వారంలో ఒక రోజు సెలవు) మంజూరు చేసింది. ఇప్పటివరకు పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ఉండేవి కాదు. కేవలం వార్షిక సెలవులకు మాత్రమే పోలీసులు అర్హులుగా ఉండేవాళ్లు. వార్షిక సెలవుల్లోనే సిక్ లీవ్, క్యాజువల్ లీవ్స్, ఎర్న్ లీవ్స్ కలిపి ఉంటాయి. 

అయితే ఈ విధానానాకి స్వస్తి చెబుతూ మంగళవారం అందరు పోలీసులకి వీక్లీ ఆఫ్ వర్తిస్తుందంటూ రాష్ట్ర డీజీపీ రిషి కుమార్ శుక్లా చేసిన ప్రకటనతో మధశ్యప్రదేశ్ లోని పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పోలీస్ స్టేషన్ లోని సిబ్బందికి మాత్రమే కాకుండా జిల్లాల్లో నియమించబడిన స్పెషల్ ఆర్మ్ డ్ ఫోర్స్ యూనిట్లకు కూడా వీక్లీ ఆఫ్ వర్తిస్తుందని శుక్లా తెలిపారు.

శుక్లా ప్రకటన అనంతరం..ఉద్యోగంలో చేరిన 38 ఏళ్లల్లో తొలిసారిగా వీక్లీ ఆఫ్ పొందిన సబ్ ఇన్ స్పెక్టర్ ఉమా శంకర్ మిశ్రా మాట్లాడుతూ… తాను చాలా హ్యీపీగా ఫీల్ అవుతున్నానని అన్నారు. వీక్లీ ఆఫ్ రోజు కుటుంబసభ్యులతో  సమయం గడిపానిని, పెండింగ్ పనులను వీలైనంత పూర్తి చేసుకున్నానని అన్నారు. వీక్లీ ఆఫ్ ఇవ్వడం వల్ల పోలీసులకు ఒత్తిడి భారం తగ్గుతుందని, మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు అవకాశముంటుందని మిశ్రా తెలిపారు. అంతేకాకుండా మొదటి రోజు వీక్ ఆఫ్ పొందిన అనేకమంది పోలీసులు తమ కుటుంభసభ్యులతో కలిసి పిక్నిక్ కి వెళ్లారు. చాలా ఏళ్ల తరువాత రిలాక్స్ అయినట్లు ఉందని భైరగర్ ఏఎస్ఐ రాకేష్ శర్మ అన్నారు.