Maharashtra Lockdown : మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు.. RT-PCR నెగటివ్ ఉంటేనే ఎంట్రీ

మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తితో జూన్ 1 లాక్ డౌన్ వరకు పొడిగించింది మహా ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మే 15తో కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది.

Maharashtra Lockdown : మహారాష్ట్రలో లాక్‌డౌన్ పొడిగింపు.. RT-PCR నెగటివ్ ఉంటేనే ఎంట్రీ

Maharashtra Extends Covid 19 Lockdown

Maharashtra extends Covid-19 lockdown : మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తితో జూన్ 1 లాక్ డౌన్ వరకు పొడిగించింది మహా ప్రభుత్వం. వైరస్ కట్టడి కోసం మరిన్ని వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ నిర్ణయించింది. జూన్ 1 ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని మహా ప్రభుత్వం తెలిపింది.  కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

కరోనా కేసుల తీవత్ర తగ్గకపోవడంతో లాక్ డౌన్ పొడిగింపుతో పాటు మరిన్ని కఠిన ఆంక్షలు కూడా విధించింది. ఏదైనా రవాణా మార్గం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించేవారంతా తప్పనిసరిగా RT-PCR నెగటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది.

దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో బుధవారం కొద్దిగా కొత్త కేసులు తగ్గినట్టు రిపోర్టు తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ప్రకారం.. మహారాష్ట్రలో కరోనా యాక్టివ్ కేసులు 30వేలకు పైగా ఉన్నాయి.

మహారాష్ట్ర కోవిడ్ -19 వృద్ధి రేటు దేశం రోజువారీ వృద్ధి రేటులో సగం మాత్రమే నమోదైంది. రాష్ట్ర రోజువారీ వృద్ధి రేటు దేశ శాతం 1.4 శాతంతో పోలిస్తే.. 0.8 శాతంగా ఉంది. మహారాష్ట్రలో రోజుకు రెండు లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే నెలరోజులుగా లాక్ డౌన్ కొనసాగుతోంది.