Mamata phone call : బీజేపీ నేతకు ఫోన్‌ చేసి మద్దతు కోరిన మమతా బెనర్జీ..ఈసీకి ఫిర్యాదు చేసిన కమలం నేతలు

నందిగ్రామ్‌లో బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్‌ చేసి మద్దతు కోరడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్‌ పాల్‌ -దీదీ తనకు ఫోన్‌ చేసి మద్దతు కోరినట్లు వెల్లడించాడు.

Mamata phone call : బీజేపీ నేతకు ఫోన్‌ చేసి మద్దతు కోరిన మమతా బెనర్జీ..ఈసీకి ఫిర్యాదు చేసిన కమలం నేతలు

Mamata Phone Call

Mamata Banerjee phone called the BJP leader : నందిగ్రామ్‌లో బీజేపీ నేతకు మమతా బెనర్జీ ఫోన్‌ చేసి మద్దతు కోరడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడైన ప్రళయ్‌ పాల్‌ -దీదీ తనకు ఫోన్‌ చేసి మద్దతు కోరినట్లు వెల్లడించాడు. మమతతో జరిగిన సంభాషణ ఆడియో టేపు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నందిగ్రామ్‌లో ఓటమి తప్పదనే మమత తమ పార్టీ నేతకు ఫోన్‌ చేశారని బీజేపీ ఫైర్‌ అయింది. మమతా బెనర్జీ తమ నేతలను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.

పోలింగ్‌ సందర్భంగా బెంగాల్‌లో కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. కంఠిలోని పోలింగ్‌ కేంద్రం దగ్గర సువేంధు అధికారి సోదరుడు సౌమేందు అధికారి కారుపై దాడి జరిగింది. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో సౌమేందు కారులో లేరు. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. కొన్నిచోట్ల బాంబు దాడుల వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.

దీనిపై ఇటు బీజేపీ, ఇటు టీఎంసీలు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. ఇటు హోం మంత్రి అమిత్ షాపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శలు చేశారు. అమిత్ షా ఎన్నికలను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని అన్నారు. తొలిదశ ఎన్నికలతోనే బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయిందన్నారు.