దిగొచ్చిన భారతీయ రైల్వే…రెండేళ్ల పోరాటంతో రూ.33 రీఫండ్

10TV Telugu News

35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత  భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి ఇచ్చిందని,దీనిపై తన పోరాటం కొనసాగుతూ ఉంటుందన్నాడు ఆ వ్యక్తి.

కోల్ కతాకు చెందిన ఇంజినీర్ సుజిత్ స్వామి(30) రాజస్థాన్ లోని కోట సిటీ నుంచి న్యూ ఢిల్లీకి జులై-2,2017న వెళ్లేందుకుగాను రూ.765తో గోల్టన్ టెంపుల్ మెయిల్ కి  ఏప్రిల్-2017లో ఓ టిక్కెట్ బుక్ చేశాడు.అయితే వెయిటింగ్ లిస్ట్ రావడంతో ఆ తర్వాత సుజిత్ ఆ టిక్కెట్ ను రద్దు చేసుకున్నాడు.దీంతో రీఫండ్ గా 665 రూపాయలు మాత్రమే సుజిత్ అందుకున్నాడు.వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న టిక్కెట్ ను రద్దు చేసుకున్నందుకు 65 రూపాయలు కట్ చేయాల్సిందిపోయి రైల్వే శాఖ 100 రూపాయలు కట్ చేసింది.సర్వీస్ ట్యాక్స్ కింద 35 రూపాయలను సుజిత్ నుంచి రైల్వే ఛార్జ్ చేసింది.

జులై-1,2017న దేశంలో జీఎస్పీ అమలులోకి వచ్చింది. అయితే జీఎస్టీ అమలులోకి వచ్చే ముందే సుజిత్ టిక్కెట్ రద్దు చేసుకున్నప్పటికీ సర్వీస్ ట్యాక్స్ కింద రైల్వే శాఖ సుజిత్ నుంచి అదనంగా 35 రూపాయలను ఛార్జ్ చేసింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కమర్షియల్ సర్క్యులర్ నెంబర్ 43 ప్రకారం జీఎస్టీ అమలుకు ముందు బుక్ అయిన టిక్కెట్లు మరియు జీఎస్టీ అమలు తర్వాత రద్దు చేసుకున్న టిక్కెట్లకు బుకింగ్ సమయంలో ఛార్జ్ చేసిన సర్వీస్ ట్యాక్స్ రీఫండ్ అవదని సుజిత్ ఆర్టీఐకి సమాధానంగా ఐఆర్ సీటీసీ తెలిపింది.దీంతో 65 రూపాయలను క్లరికల్ ఛార్జ్,35 రూపాయలు సర్వీస్ ట్యాక్స్ కింద మొత్తంగా 100 రూపాయలు చార్జ్ చేసినట్లు ఐఆర్ సీటీసీ తెలిపింది. 

అయితే జులై-1,2017కి ముందు బుక్ అయిన,రద్దు అయిన టిక్కెట్లుకు సంబంధించి బుకింగ్ సమయంలో ఛార్జ్ చేసిన సర్వీస్ ట్యాక్స్ మొత్తం రీఫండ్ చేయాలని ఆ తర్వాత తాము నిర్ణయించినట్లు ఆర్టీఐకి రిప్లైయ్ గా ఐఆర్ సీటీసీ తెలిపింది. దీంతో సుజిత్ కి 35 రూపాయలు రీఫండ్ చేయబడుతుందని ఐఆర్ సీటీసీ తెలిపింది. అయితే మే-1,2019న సుజిత్ కి బ్యాంకు అకౌంట్లో రైల్వేశాఖ రెండు రూపాయలు తగ్గించి 33 రూపాయలు మాత్రమే జమ చేసింది.అయితే కమర్షియల్ సర్క్యులర్ నెంబర్ 49 ప్రకారం 35 రూపాయలు రీఫండ్ చేస్తామని ఐఆర్ సీటీసీ చెప్పిందని,అయితే రెండు తగ్గించి రీఫండ్ చేసిందని,రెండు రూపాయలను కూడా వదిలిపెట్టనని,రెండు రూపాయలు తిరిగి చెల్లించేతవరకు తన పోరాటం కొనసాగుతుందని సుజిత్ తెలిపారు.అయితే సుజిత్ ఒక్కడికి మాత్రమే ఈ నష్టం కలగలేదని సుజిత్ ఫైల్ చేసిన ఆర్టీఐ ద్వారా తేలింది. దాదాపు 9 లక్షల మంది ప్యాసింజర్లు ఇలా నష్టపోయినట్లు తేలింది.ఈ ప్యాసింజర్ల నుంచి 3.34 కోట్ల రూపాయలు సర్వీస్ ట్యాక్స్ కింద రైల్వే చార్జ్ చేసింది.