కృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించండి…పిటిషన్ ను స్వీకరించిన మథుర కోర్టు

  • Published By: venkaiahnaidu ,Published On : October 16, 2020 / 05:41 PM IST
కృష్ణ జన్మభూమిలోని మసీదును తొలగించండి…పిటిషన్ ను స్వీకరించిన మథుర కోర్టు

mosque adjacent to Krishna Janmabhoomi శ్రీ కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ను శుక్రవారం(అక్టోబర్-16,2020) మథురలోని స్థానిక కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో నవంబర్-18న తుదపరి వాదనలు ఉంటాయని మథుర జిల్లా జడ్జి సద్నా రాణి ఠాకూర్ తెలిపారు.



మరోవైపు, ఈ ఏడాది అక్టోబర్ లో కృష్ణ జన్మభూమి ఆనుకొని ఉన్న మసీదును తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ ను మథుర సివిల్ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణ జన్మభూమి పక్కనే ఉన్న షాహి ఈద్గా మసీదును తొలగించి మొత్తం భూమిని అప్పగించాలంటూ ‘భగవాన్ శ్రీ కృష్ణ విరాజ్మన్’ తరపున న్యాయవాదులు హరిశంకర్, విష్ణు జైన్ మధుర కోర్టులో గత నెల 25 న పిటిషన్ వేశారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, షాహి ఈద్గా మేనేజ్‌మెంట్ కమిటీ మధ్య కుదిరిన భూమి ఒప్పందాన్ని ఆమోదిస్తూ 1968లో మధుర కోర్టు ఇచ్చిన రూలింగ్‌ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సేనలు శ్రీకృష్ణుడి జన్మస్థలం అని నమ్ముతున్న స్థలంలోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పిటిషన్‌ను అప్పుడు సివిల్ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణకు అనుమతించకపోవడానికి కారణం ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం-1991 ప్రకారం నిషేధం ఉండటమేనని కోర్టు చెప్పింది.



కాగా,2019 నవంబర్ లో అయోధ్యలోని దశాబ్దాల రామజన్మభూమి-మసీదు వివాదంలో…అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం చారిత్రాత్మకమైన తీర్పు వెలువరించినప్పటినుంచి మథురలోని కృష్షజన్మభూమి,వారణాశిలోని కాశీ విశ్వనాథ్ ఆలయాలను ఆనుకొన్ని ఉన్న మసీదులను తొలగించాలంటూ పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.