అమెరికా బాటలోనే! : భారత్ లో కరోనా ఎలా విజృంభిస్తుందో చూడండి

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2020 / 02:24 PM IST
అమెరికా బాటలోనే! : భారత్ లో కరోనా ఎలా విజృంభిస్తుందో చూడండి

భారత్ లో రోజురోజుకీ పెరిగిపోతున్న కరోనా కేసులు ఆందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అమెరికా మాదిరిగా మనదేశంలో కూడా కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో ఇప్పటివరకు 716 కరోనా కేసులు నమోదయ్యాయి. 13మరణాలు సంభవించాయి.

అయితే గడిచిన 48గంటల్లోనే భారత్ లో 100కి పైగా కేసులు నమోదవడం అందరినీ టెన్షన్ పెడుతుంది .గడిచిన నాలుగు రోజుల్లోనే భారత్ లో చాలా వేగంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్ర,తమిళనాడు,కేరళలోనే నమోదయ్యాయి. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు 100 దాటిపోగా,తెలంగాణాలో 40 దాటాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 103 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.

	C-1.JPG

ఒకవేళ ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లోనే భారత్ లో కరోనా కేసుల సంఖ్య 1000కి చేరకునే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అయితే భారతదేశం యొక్క పథం ఇప్పటికీ అమెరికాకు చాలా దగ్గరగా ఉంది. చాలా వేగంగా మనదేశంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో కూడా ఇలాగే నెమ్మదిగా పెరుగుతూ ఇప్పుడు 69వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా అమెరికాలో 1000కి పైగా కరోనా మరణాలు ఇప్పటివరకు సంభవించాయి.

	C2.JPG

వేగంగా కరోనా కేసులతో అమెరికా…కోవిడ్-19 యెక్క ప్రపంచ కేంద్రంగా మారుతోంది. కరోనాకు చైనానే పుట్టినిల్లు అయినప్పటికీ…ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాలు కరోనాకు కొత్త హాట్ స్పాట్ లుగా ఉన్నాయి. ప్రపంచంలోని అన్నిదేశాల కంటే ఇటలీలోనే కరోనా మరణాలు అత్యధికమన్న విషయం తెలిసిందే.

అయితే మరోవైపు ఇతరదేశాలతో పోల్చితే కరోనా టెస్ట్ ల విషయంలో అమెరికా చాలా వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా టెస్ట్ లు చేయవలసిన అవసరం లేదని ఇప్పటివకే అగ్రరాజ్యపు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా టెస్ట్ ల విషయంలో ఆయన ఆలోచన చాలా ఢిఫరెంట్ గా ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా వేలమంది అమెరికన్లు చనిపోయే ప్రమాదముంది,దేశవ్యాప్త షట్ డౌన్ కు పిలుపునివ్వబోతున్నారా అని రెండు రోజుల క్రితం ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం… దేశవ్యాప్త షట్ డౌన్ చేసే ప్రశక్తే లేదు. షట్ డౌన్ చేస్తే కరోనా మరణాలు కన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంకా ఎక్కువమంది మరణిస్తారని ఆయన అభిప్రాయపడుతున్నారు.

	C3.JPG

 

	C4.JPG

 

	C5.JPG