Corona Cases : దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. సగానికి పైగా కేసులు కేరళ నుంచే

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ రాష్ట్రము నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయి. ఇక మృతుల సంఖ్య మహారాష్ట్రలో అధికంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 65 శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయి.

10TV Telugu News

Corona Cases : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు 40వేలకుపైగా పాజిటివ్‌ నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 43,509 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 24గంటల్లో కొత్తగా 38,465 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు మరణాలు కాస్త పెరిగాయి.

బుధవారం 640 మంది కరోనాతో మృతి చెందారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,22,662 మంది మృతి చెందారు. వైరస్‌ నుంచి ఇప్పటి వరకు మంది 3,07,01,612 మంది కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 4,03,840 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.28శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.38శాతానికి చేరిందని తెలిపింది. ఇక టీకా పంపిణి వేగంగా సాగుతుంది. బుధవారం వరకు 45.07కోట్ల మోతాదులు పంపిణీ చేసినట్లు వివరించింది. ఇక దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50 శాతం కేసు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి.

కేరళలో బుధవారం 22,056 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. బుధవారం అత్యధికంగా మహారాష్ట్రలో 286 మంది కరోనాతో మృతి చెందారు.. ఇక్కడ కొత్తగా 6,857 కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులు, మరణాలు కలవరపెడుతున్నాయి. కేరళలో కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కేసుల పెరుగుదల అధికంగా ఉండటంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు లాక్ డౌన్ విధించింది.

10TV Telugu News