కొత్త సారధి : బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 09:24 AM IST
కొత్త సారధి : బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు

బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చేశారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. పార్టీ ఎన్నికల నిర్వాహణ ఇన్ ఛార్జీ రాధా మోహన్ సింగ్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2020, జనవరి 20వ తేదీ సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియకు అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, బీజేపీ ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు.

జేపీ నడ్డా ఉదయం 10 గంటలకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. నడ్డా పేరును అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరి ప్రతిపాదించారు. మధ్యాహ్నం 2.30గంటలకు తర్వాత పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాధా మోహన్ సింగ్ ప్రకటించారు. 

* ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటలకు వరకు నామినేషన్ల స్వీకరణ.
* మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30గంటల వరకు నామినేషన్ల పరిశీలన. 
* మధ్యాహ్నం 1.30గంటల నుంచి 2.30గంటల వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు. 

Read More : అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలివే