పౌష్టికాహారం కోసం : రేషన్ షాపుల్లో చికెన్, మటన్, గుడ్లు!

  • Published By: madhu ,Published On : December 21, 2019 / 04:50 AM IST
పౌష్టికాహారం కోసం : రేషన్ షాపుల్లో చికెన్, మటన్, గుడ్లు!

రేషన్ షాపుల్లో ఏం దొరుకుతాయి. బియ్యం, గోధుమలు, చక్కెర, పప్పు ధాన్యాలు దొరుకుతాయి..గిదేంది..చికెన్, గుడ్లు ఇస్తారా ?..నీతి ఆయోగ్ దీనిపై కసరత్తులు జరుపుతోంది. పౌష్టికాహార లోపం వల్ల ఎంతో మంది బాధ పడుతున్నారని, ప్రధానంగా చిన్నారులు ఈ లోపంతో రోగాల బారిన పడుతుండడంపై నీతి ఆయోగ్ దృష్టి సారించింది. కల్తీ పదార్థాల వల్ల వైద్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని, సబ్సిడీ ద్వారా నాణ్యమైన మాంసాహారాన్ని అందిస్తే పౌష్టికాహారం వస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు.

నూనె, చక్కెర, మసాల తదితర పదార్థాలపై ఎక్కువ ఖర్చు పెడుతున్నారని వెల్లడించారు. రేషన్ షాపుల ద్వారా చికెన్, గుడ్లు, చేపలు, మటన్ అందచేయాలని యోచిస్తోంది. తక్కువ ధరలకే పుష్టికరమైన ఆహారం అందించేందుకు ఈ ప్రతిపాదన ముందుకు తెస్తోందంట. బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలతో పాటు వీటిని ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా దేశంలోని పేదలకు అందచేసే విషయంలో సాధ్యసాధ్యాలను పరిశీలిస్తోంది. 

PDS ద్వారా ఇప్పటికే సబ్సిడీ ఆహార పదార్థాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చికెన్, గుడ్లు పంపిణీ చేసే అంశాన్ని నీతి ఆయోగ్ 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌లో పెట్టే అవకాశాలున్నాయి. UN ఇండియా ప్రకారం సుమారు 195 మిలియన్ల మంది భారతీయులు పోషకాహార లోపంతో ఉన్నారని నివేదిక వెల్లడిస్తోంది. చికెన్, గుడ్లు, మటన్, చేపలను రేషన్ షాపుల్లో భద్రపరిచేందుకు ఎలాంట ిజాగ్రత్తలు తీసుకొంటారో..ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్రాలు ఎలా భరిస్తాయోనన్నది తెలువాల్సి ఉంది. 
Read More : చలి..చలి : ఢిల్లీలో భారీగా పొగమంచు..46 విమాన సర్వీసుల మళ్లింపు