ఇది బజారు కాదు…విపక్ష సభ్యులపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2020 / 10:16 AM IST
ఇది బజారు కాదు…విపక్ష సభ్యులపై రాజ్యసభ చైర్మన్ ఆగ్రహం

విపక్షాల తీరుపై ఇవాళ(మార్చి-5,2020) రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో గత వారం సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాత్మక అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు….సభలో ఆందోళనకు దిగాయి. వెంకయ్య ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తూ.. సభను ఆటంకపరిచారు విపక్ష సభ్యులు. దీంతో రాజ్యసభ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్చలపై ఎలాంటి నోటీసు ఇవ్వకుండా.. చర్చలో పాల్గొనకుండా నినాదాలు చేయడం సరికాదని సభ్యుల తీరును తప్పుబట్టారు. సభ ముందుకు సాగకుండా దేశ ప్రజలకు, దేశానికి మంచిది కాదని ప్రతిపక్షాలకు సూచించారు. నినాదాలు చేయొద్దు. ఇది పార్లమెంట్ .. బజారు కాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అయినా సభ్యులు ఎంతకు శాంతించకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు.

మరోవైపు లోక్ సభలో కూడా ఇదే తంతు కొనసాగింది. గత మూడురోజులగా లోక్ సభకు అంతరాయం కలిగిస్తున్న ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలను మిగిలిన బడ్జెట్ సెషన్ లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు  లోక్ సభ చైర్మన్ ఓం బిర్లా. సస్పెండ్ అయిన వారిలో గౌరవ్ గొగొయ్,టీఎన్ ప్రతాపన్,దీన్ కురియకోస్,బెన్నీ బెహనానమ్ మనిచ్ కమ్ టాగోర్,రాజ్ మోహన్ ఉన్నితాన్,గుర్జీత్ సింగ్ ఔజ్లా లు కూడా ఉన్నారు.

See Also | నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి