Term Insurance : వ్యాక్సిన్ వేయించుకుంటేనే టర్మ్ పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీల కొత్త రూల్

బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అంటున్నాయి.

Term Insurance : వ్యాక్సిన్ వేయించుకుంటేనే టర్మ్ పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీల కొత్త రూల్

Term Insurance

Term Insurance : బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలా? ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారా? కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారా? అయితే ఆధార్ తప్పనిసరిగా కావాల్సిందే. ఏ పనికైనా దేశంలో ఆధార్ మస్ట్. ఇప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ తో పాటు మరో సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అంటున్నాయి.

ప్రస్తుతం దేశం కరోనా సెకండ్ వేవ్ తో అతలాకుతలం అయ్యింది. ఎప్పుడు ఎవరికి కరోనా సోకుతుందో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు టర్మ్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్ లు చేయించుకుంటున్నారు. వ్యాక్సినేషన్ వేయించుకుంటే కరోనాతో పోరాటం చేయడమే కాదు ఇంకా చాలా వాటికి అది ఉపయోగపడుతుంది.

అందుకే అవకాశం ఉన్న వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. ఇక మీద మీరు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఆధార్ మాత్రమే సరిపోదు. కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు నిర్ధారించే సర్టిఫికెట్ కూడా ఉండాల్సిందే. 45ఏళ్లు నిండిన వాళ్లు టర్మ్ పాలసీ తీసుకోవాలంటే ఫైనల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పకుండా సమర్పించాలని చెబుతోంది మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ.

వయసుతో సంబంధం లేకుండా ఫస్ట్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు చూపిస్తేనే పాలసీలు జారీ చేస్తామని టాటా ఏఐజి తెలిపింది. త్వరలోనే ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉందని అంటున్నారు. కొవిడ్ వల్ల ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. అలాగే దీని వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పే లోడ్ తగ్గించుకునేందుకు వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికే టర్మ్ పాలసీలు ఇవ్వాలన్న నిర్ణయానికి ఈ రెండు కంపెనీలు వచ్చాయని చెబుతున్నారు.

దీర్ఘకాలంగా స్మోకింగ్ చేసే వారికి పాలసీ అంటే అంత ఈజీగా రాదు. ఇక్కడ కూడా అదే వర్తిస్తుందని చెబుతున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే వ్యాక్సిన్ తీసుకునేందుకు సంకోచించే వారు కూడా టీకా తీసుకుంటారని అంటున్నారు.