Omicron : కొత్త వ్యాక్సిన్ అక్కర్లేదు,బూస్టర్ డోస్ రెడీ..సీరం సీఈవో కీలక వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు..ఈ వేరియంట్

Omicron : కొత్త వ్యాక్సిన్ అక్కర్లేదు,బూస్టర్ డోస్ రెడీ..సీరం సీఈవో కీలక వ్యాఖ్యలు

Poonawala

Adar Poonawalla :  దక్షిణాఫ్రికాలో తాజాగా వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్”ఇప్పుడు ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు..ఈ వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేస్తాయా? లేదా? అనే సందేహాలు నెలకొన్న వేళ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా ఓ జాతీయ ఛానల్ కు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించి టెస్ట్ లు కొనసాగుతున్నాయని, మరో రెండు వారాల్లో ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకోబడుతుందని,అప్పటికి కొత్త వేరియంట్ గురించి మరింత సమాచారం తెలుస్తుందని పూనావాలా చెప్పారు.

ఒమిక్రాన్ పై ఆక్స్‌ఫర్డ్‌లోని శాస్త్రవేత్తలు కూడా తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారని,వారి పరిశోధనల ఆధారంగా ఆరు నెలల్లో బూస్టర్‌గా పనిచేసే కొత్త వ్యాక్సిన్‌ ను తాము తీసుకొచ్చే అవకాశముందని తెలిపారు. పరిశోధన ఆధారంగా, మనందరికీ మూడవ మరియు నాల్గవ డోస్ గురించి తెలుస్తుందన్నారు. అయితే, ఓమిక్రాన్‌కు నిర్దిష్ట వ్యాక్సిన్‌ వెర్షన్‌ అవసరం లేదని చెప్పాడు. పరిశోధన అవసరమని సూచిస్తే, ఓ కోవిషీల్డ్ వెర్షన్..ఒమిక్రాన్ కోసం పరిగణించబడుతుందన్నారు

కోవిషీల్డ్ యొక్క సమర్థత చాలా ఎక్కువగా ఉందని,ఈ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల హాస్పిటల్ లో చేరే అవకాశాలను, మరణించే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని లాన్సెట్(మెడికల్ జర్నల్) నివేదించింది. లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ…కోవిషీల్డ్ యొక్క సమర్థత కాలక్రమేణా పడిపోతుందనేవి అనవసరమైనదని పూనావాలా చెప్పారు.

అదేవిధంగా,ఒక బూస్టర్ డోస్ అవసరమైతే,తమ కంపెనీ తగినంత మోతాదులను కలిగి ఉందని,ప్రస్తుతం కోవిషీల్డ్ వ్యాక్సిన్ అందిస్తున్న ధరకే దాన్ని అందుబాటులో ఉంచుతామని పూనావాలా అన్నారు. “మా క్యాంపస్‌లో వందల మిలియన్ల స్టాక్‌లు ఉన్నాయి. భారతదేశంలోని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు 200 మిలియన్లకు పైగా డోస్‌లు రిజర్వు చేయబడ్డాయి. కాబట్టి, ప్రభుత్వం బూస్టర్ డోస్‌ను ప్రకటించాలనుకుంటే, మేము బాగా నిల్వలు కలిగి ఉన్నాము” అని పూనావాలా అన్నారు. ప్రస్తుతానికి, వ్యాక్సిన్ తీసుకోని వారికి వ్యాక్సిన్.. ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారికి రెండవ డోస్ అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ రెండు డోసులను పొందడం ప్రధాన్యతగా ఉండాలన్నారు. రక్షణగా ఉండేందుకు అదే మొదటి అడుగు అన్నారు. ఆ తర్వాత మాత్రమే వచ్చే ఏడాది బూస్టర్‌లతో ఆ భద్రతను పెంచుకోవచ్చని అన్నారు.

మరోవైపు, అమెరికా,కొన్ని యూరప్ దేశాలలో కోవిడ్ బూస్టర్ డోసులు ఇస్తున్నట్లుగా….సమీప భవిష్యత్తులో బూస్టర్ డోస్ కోసం ఎటువంటి ప్రణాళిక లేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ ప్యానెల్ చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా.. బూస్టర్ షాట్ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. భారతదేశం మరియు యూరప్ మరియు ఉత్తర అమెరికాలోని దేశాల పరిస్థితి ఒకేలా లేదని అరోరా పేర్కొన్నారు. మన జనాభాలో చాలా ఎక్కువ మంది కోవిడ్ బారిన పడ్డారని, వ్యాక్సిన్‌లు అదనపు రక్షణను అందిస్తున్నాయని ఆయన చెప్పారు.

పండుగలు ఉన్నప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పుడు,దీపావళి- దసరా సమయంలో దేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున గుమికూడినప్పుడు.. భారతదేశంలో రోగనిరోధక శక్తి ప్రబలంగా ఉందన్న సాక్ష్యం స్పష్టంగా తేలిందని అరోరా తెలిపారు.

ALSO READ Borewell Pipe : నిన్న వాటర్ ట్యాంక్.. నేడు బోరు పైపు.. చిత్తూరు జిల్లాలో మరో వింత.. భూమి నుంచి బయటకు