Omicron Variant : దేశంలో 21కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. రాజస్తాన్‌లో ఒకే కుటుంబంలో 9మందికి పాజిటివ్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి..

Omicron Variant : దేశంలో 21కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు.. రాజస్తాన్‌లో ఒకే కుటుంబంలో 9మందికి పాజిటివ్

Omicron Variant

Omicron Variant : యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. తాజాగా రాజస్తాన్ లోని ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒకేసారి ఇన్ని కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే 3 రకాల ఆహారాలు ఇవే..!

జైపూర్ ఆదర్శ్ నగర్ లోని ఓ కుటుంబంలోని వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 9 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వారందరూ కొన్నిరోజుల కిందట దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చారు. కొత్త వేరియంట్ కలకలం నేపథ్యంలో, రాజస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న ప్రాంతంలో కర్ఫ్యూ విధించింది.

కుటుంబానికి చెందిన నలుగురు నవంబర్ 25న సౌతాఫ్రికా నుంచి దుబాయ్ మీదుగా భారత్ వచ్చారు. వాళ్ల శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ అని తేలింది. అందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ కుటుంబంతో కాంటాక్ట్ అయిన మరో ఐదుగురికి కూడా ఒమిక్రాన్ సోకింది.

Komaki Ranger : కొత్త ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు

భారత్ లో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి పెరిగింది. మహారాష్ట్రలోని పుణెలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలుత కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి.

తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ​ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. భారత్​లో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో భారత్​లో కరోనా థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి. థర్డ్ వేవ్​ను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధం కావాలని నిపుణులు
హెచ్చరిస్తున్నారు.

ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్​ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఈ రకం కరోనా కేసులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. మన దేశంలో తొలుత కర్నాటకలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్​లోని జామ్​నగర్​లో మూడో కేసు వచ్చింది. నిన్న (శనివారం) ముంబైలో నాలుగో కేసు నమోదవగా.. తాజాగా ఆదివారం ఢిల్లీలో ఐదో కేసు బయటపడింది. ఆ తర్వాత మహారాష్ట్రలో ఏడు, రాజస్తాన్ లో 9 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి.