Health Ministry : నో థర్డ్ వేవ్..మోదీ టార్గెట్ ఇచ్చారు

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు.

Health Ministry : నో థర్డ్ వేవ్..మోదీ టార్గెట్ ఇచ్చారు

Vk Paul

Health Ministry దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ కేసులు నమోదవ్వకముందే దాన్ని అడ్డుకోవాలని ప్రధాని మోదీ తమకు టార్గెట్ ఇచ్చారని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మరియు నీత్ ఆయోగ్ సభ్యుడు(హెల్త్) వీకే పాల్ శుక్రవారం తెలిపారు. కోవిడ్ థర్డ్ వేవ్ ని అడ్డుకోవడమే కేంద్రం ప్రతిష్టాత్మక లక్ష్యమని తెలిపారు. కాగా, ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్,కర్ణాటక సహా ఆరు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ప్రధాని మోదీ.. తప్పనిసరిగా కోవిడ్ థర్డ్ వేవ్ ని అడ్డుకోవడమే ప్రాధాన్యతగా ఉండాలని చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలోనే ఉందని వీకే పాల్ తెలిపారు. అయితే థర్డ్ వేవ్ థర్డ్ వేవ్ వ్యాప్తి ఏ క్షణమైనా జరగవచ్చన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసుల పెరుగుదల మనకు ఓ హెచ్చరిక లాంటిదన్నారు. చాలా ప్రాంతాల్లో పరిస్థితి బ్యాడ్ నుంచి దారుణంగా మారిందన్నారు. మొత్తంగా, ప్రపంచమంతా థర్డ్ వేవ్ వైపు కదులుతుందన్నారు. థర్డ్ వేవ్ పై డబ్యూహెచ్ వో వార్నింగ్ ను తేలికగా తీసుకోకూడదన్నారు. అది ఓ రెడ్ ఫ్లాగ్ అని పాల్ అన్నారు. కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని అవకాశాలను పరిశీలించాలని ప్రధాని మోదీ తమకు చెప్పారన్నారు. కోవిడ్-19 పై పోరాటంలో రాబోయే 100-125రోజులు చాలా కీలకమన్నారు.

జూన్-21 నుంచి దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి మరింత మందికి వ్యాక్సిన్ అందించే చర్యలను ప్రభుత్వం చేపడుతుందని పాల్ తెలిపారు. జులై కి ముందే 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందిచాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఉన్నట్లు తెలిపారు. 66 కోట్ల కోవిషీల్డ్,కోవాగ్జిన్ డోసులకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందన్నారు. అదనంగా,22 కోట్ల డోసులు ప్రైవేట్ సెక్టార్ కి వెళ్తాయని తెలిపారు.

కాగా, దేశంలో జాన్-21న 86.16 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగా అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు. నిన్న(జులై-15,2021)దేశవ్యాప్తంగా 38.79లక్షల మందికి మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక, కోవిడ్ వ్యాక్సిన్ల పనితీరు అద్భుతంగా ఉందన్నారు వీకే పాల్. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో..వ్యాక్సిన్ ఒక డోసు మరణాల రేటును 82% తగ్గించగలిగిందని.. 95% మరణాలను నివారించడంలో రెండు డోసుల వ్యాక్సిన్ విజయవంతమైందని పాల్ అన్నారు. ఇక,చిన్నపిల్లల కోసం జైడస్ కాడిలా అభివృద్ధి చేస్తోన్న కోవిడ్ వ్యాకిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న ప్రశ్నకు..డీజీసీఐ దీనిని పరిశీలిస్తుందని,శాస్త్రీయ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు.మరోవైపు, మాస్క్ ల వాడకం ఈ మధ్య తగ్గిందని,ఓ కొత్త నిబంధనలాగా ఫేస్ మాస్క్ ల వాడకాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.