PM Modi Varanasi : కాలభైరవుడికి మోదీ ప్రత్యేక పూజలు

ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లారు.. వారణాసిలో పర్యటించిన ఆయన కాలభైరవుడికి పూజలు నిర్వహించారు.

PM Modi Varanasi : కాలభైరవుడికి మోదీ ప్రత్యేక పూజలు

Pm Modi Varanasi

PM Modi Varanasi : వారణాసి అభివృద్ధిలో భాగంగా నిర్మించిన కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్‌ను ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ వెళ్లారు. ఈ రోజు ఉదయం వారణాసి విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. గంగా స్నానం ఆచరించారు.. అనంతరం కాలభైరవ దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుడికి పూజలు నిర్వహించారు. విశ్వేశ్వరుడికి జలాభిషేఖం నిర్వహించారు ప్రధాని. గంగా నది నుంచి నీటిని తీసుకొచ్చిన మోదీ తన చేతులతో స్వామివారికి అభిషేఖం చేశారు. ఇక గంగా జలంతో దేవాలయంలోకి వస్తున్న సమయంలో ఢమరుకంతో ఘనస్వాగతం పలికారు.

చదవండి : PM Modi : రావత్ మరణం ప్రతి దేశభక్తుడికీ లోటే..దేశాన్ని మరింత శక్తిమంతం చేస్తాం

ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటు యూపీ మంత్రులు ఉన్నారు. ఈ రోజు ప్రధాని కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ను ప్రారంభిస్తారు. దీనిని ప్రధాని మోదీ మార్చి 8, 2019న శంకుస్థాపన చేశారు. ఇది 5 లక్షల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించిన ఆలయం నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పించేందుకు 23 కొత్త భవనాలను నిర్మించారు.

చదవండి : Modi Twitter : పీఎం మోదీ ట్విట్టర్ హ్యాక్

కారిడార్ ప్రారంభోత్సవానికి వివిధ మఠాలకు చెందిన మూడు వేల మంది సాధువులు, మతపెద్దలు, కళాకారులతో పాటు పురప్రముఖులు పాల్గొన్నారు. వీరితో పాటు BJP పాలిత రాష్ట్రాలకు చెందిన 12 మంది CMలు హాజరవుతారు. ఈ కారిడార్ నిర్మాణానికి దాదాపు 32 నెలలు పట్టింది. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో 95 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం కారిడార్‌ నిర్మాణానికి రూ.340 కోట్లు వ్యయం చేశారని భావిస్తున్నారు.