PM Modi : అసోంలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం!

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఏప్రిల్ 28) నుంచి అసోంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు కర్బీ అంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు.

PM Modi : అసోంలో ప్రధాని మోదీ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం!

Pm Modi Pm Narendra Modi To Visit Assam Today To Launch Several Development Projects

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం (ఏప్రిల్ 28) నుంచి అసోంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు కర్బీ అంగ్లాంగ్ జిల్లా దిఫులో శాంతి, ఐక్యత, అభివృద్ధి ర్యాలీలో మోదీ పాల్గొననున్నారు. ఈ ర్యాలీలో మోదీతో పాటు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా పాల్గొననున్నారు. అనంతరం డిఫు వెటర్నరీ కళాశాల, పశ్చిమ కర్బీ అంగ్లాంగ్ డిగ్రీ కళాశాల, కొలోంగా, వెస్ట్ కర్బీ అంగ్‌లాంగ్‌లో వ్యవసాయ కళాశాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా రూ. 500 కోట్ల కన్నా ఎక్కువ విలువైన ప్రాజెక్టులతో నైపుణ్యం, ఉపాధికి కొత్త అవకాశాలను అందించనున్నారు.

2,950కి పైగా అమృత్ స‌రోవ‌ర్ ప్రాజెక్టుల‌కు కూడా మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్నారు. దాదాపు రూ. 1,150 కోట్ల వ్యయంతో అసోంలో అమృత్ సరోవర్లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధాని మోదీ అసోం మెడికల్ కాలేజీ, డిబ్రూఘర్ చేరుకోనున్నారు. దిబ్రూగఢ్ క్యాన్సర్ ఆస్పత్రిని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, డిబ్రూఘర్‌లోని ఖనికర్ మైదానంలో జరిగే బహిరంగ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. డిబ్రూఘర్, కోక్రాఝర్, బార్పేట, దర్రాంగ్, తేజ్‌పూర్, లఖింపూర్, జోర్హాట్‌లలో నిర్మించిన క్యాన్సర్ ఆస్పత్రిని మోదీ ప్రారంభించనున్నారు. అసోం ప్రభుత్వం, టాటా ట్రస్ట్‌ల జాయింట్ వెంచర్ అసోం క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దక్షిణాసియాలో అతిపెద్ద ప్రాజెక్ట్‌ని అసోం ప్రభుత్వం అమలు చేస్తోంది.

Pm Modi Pm Narendra Modi To Visit Assam Today To Launch Several Development Projects (1)

Pm Modi Pm Narendra Modi To Visit Assam Today To Launch Several Development Projects 

రాష్ట్రవ్యాప్తంగా 17 క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్‌తో క్యాన్సర్ కేర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశారు. మొదటి దశలో 10 ఆస్పత్రుల్లో ఏడు ఆసుపత్రుల నిర్మాణం పూర్తయింది. వివిధ స్థాయిలలో నిర్మాణ దశలో మరో 3 ఆస్పత్రులు ఉన్నాయి. రెండో దశలో ఏడు కొత్త క్యాన్సర్ ఆస్పత్రులను నిర్మించనున్నారు. ధుబ్రి , నల్బారి, గోల్‌పరా, నాగాన్, శివసాగర్, టిన్సుకియా, గోలాఘాట్‌లలో నిర్మించనున్న ఏడు కొత్త క్యాన్సర్ ఆస్పత్రులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. మోదీ పర్యటన సందర్భంగా ఈరోజు రెండు జిల్లాలకు అసోం ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Read Also : PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు