Kisan Drones : రైతులకు శుభవార్త, కిసాన్ డ్రోన్లు వచ్చేశాయి.. పురుగుల మందు పిచికారి

డ్రోన్ల వల్ల యువతకు ఉపాధి, కొత్త అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అపరిమితమైన అవకాశాలు లభిస్తాయని, రైతులకు కూడా ఎంతో సహకారం ఉంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో

Kisan Drones : రైతులకు శుభవార్త, కిసాన్ డ్రోన్లు వచ్చేశాయి.. పురుగుల మందు పిచికారి

PM Narendra Modi

PM Narendramodi : పంటలు పండించే రైతన్నలు పురుగుల మందుల పిచికారి విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీంతో వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సర్కార్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న పంట పొలాల్లో పురుగుల మందు పిచికారి చేసేందుకు డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 100 కిసాన్ డ్రోన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. వివిధ నగరాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..

Read More : West Bengal : దుర్గాదేవిగా మమతా బెనర్జీ..మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. పోస్టర్ దుమారం

కిసాన్ డ్రోన్లతో పొలాల్లో పురుగుల మందుల పిచికారీ చేయొచ్చని వెల్లడించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం కొత్త అధ్యయంగా పేర్కొన్నారు. రెండు సంవత్సరాలలో గరుడ ఏరోస్పేస్ కింద లక్ష మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ల తయారీ లక్ష్యంగా పని చేస్తామన్నారు. డ్రోన్ల వల్ల యువతకు ఉపాధి, కొత్త అవకాశాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో అపరిమితమైన అవకాశాలు లభిస్తాయని, రైతులకు కూడా ఎంతో సహకారం ఉంటుందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రైతులకు డిజిటల్, హై టెక్ టెక్నాలజీని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కిసాన్ డ్రోన్లు, రసాయన రహిత సహజ వ్యవసాయం, ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సాహిస్తోందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో వెల్లడించారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.