PM Modi: కొవిడ్ కట్టడిపై ఫోకస్.. రేపు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ తీవ్రత దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం 2,541 మందికి పాజిటివ్‌గా నమోదైంది. 30 మంది కొవిడ్‌తో చికిత్స ...

PM Modi: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు రోజురోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ తీవ్రత దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం 2,541 మందికి పాజిటివ్‌గా నమోదైంది. 30 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్ కట్టడికి చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు చేసింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్నారు. ఈనెల 27న(బుధవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రాల్లో కొవిడ్ కేసుల తీవ్రత, కొవిడ్ వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష జరపనున్నారు.
PM Modi : సీఎంల నుంచి మోదీ అభిప్రాయ సేకరణ
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రిత్వ శాఖల అధికారులు
పాల్గోనున్నారు. కోవిడ్ కేసుల కట్టడికి చర్యలు తీసుకోవాలని, ప్రజలు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని, టెస్టింగ్, వ్యాక్సినేషన్ అంశాలపైనా ముఖ్యమంత్రులతో మోడీ ప్రధాని మాట్లాడనున్నారు. అయితే దేశంలో కొవిడ్ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజెంటేషన్ చేస్తారని తెలుస్తుంది. ఇదిలాఉంటే జనవరి 13న ప్రధాని మోదీ ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశంలోని కొవిడ్-19 కేసుల పెరుగుదల నేఫథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మాట్లాడారు.
PM Modi in JandK: ఆర్టికల్ 370 రద్దు అనంతరం మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన
దేశంలో కొవిడ్ కేసుల తీవ్రత కలవరానికి గురిచేస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల నమోదు సంఖ్య పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో సోమవారం 2,541 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4,30,60,08కి చేరుకుంది. క్రియాశీల కేసులు 16,522 కు పెరిగాయి. దేశంలో గత 24గంటల్లో 30మరణాలు నమోదయ్యాయి. మొత్తం కోవిడ్ సంబంధిత మరణాల సంఖ్య 5,22,223 కు చేరుకుంది. కోవిడ్ తో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ కేసుల పెరుగుదల ఆందోళణ కలిగిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయడం ఢిల్లీ ప్రభుత్వం మాత్రమే కాదు. ఇటీవల, ఉత్తర ప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా మాస్క్‌లను తప్పనిసరి చేయడానికి నిబంధనలను విధించాయి.
- Corona: దేశంలో కొత్తగా 11,739 కరోనా కేసులు
- Minister AmitShah: 19ఏళ్లుగా మోదీ ఆ బాధను భరించాడు.. నేను దగ్గరగా చూశాను..
- Covid Vaccine: వ్యాక్సిన్లతో 42లక్షల మంది ప్రాణాలు కాపాడిన ఇండియా
- COVID: కరోనా సోకిన చిన్నారుల్లో 2 నెలల పాటు ఈ లక్షణాలు: పరిశోధకులు
- corona: దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు
1Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
2Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
3Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
4Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ కోసం 5 యోగాసనాలు
5Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు
6Telangana : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
7TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
8Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
9Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
10Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు
-
Twitter Accounts : ట్విటర్‌కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్‌లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్‌కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ