Bharath Jodo Yatra : రేపు భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న ప్రియాంకా గాంధీ

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో అక్టోబర్ 7న రాహుల్ గాంధీ సోదరి.. ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో కొనసాగనున్న జోడో యాత్రలో ప్రియాంక గాంధీ సోదరుడు..పార్టీ శ్రేణులతో కలిసి నడువనున్నారు.

Bharath Jodo Yatra :  రేపు భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న ప్రియాంకా గాంధీ

Bharath Jodo Yatra..Priyanka gandhi

Bharath Jodo Yatra..Priyanka gandhi : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తల్లీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా జిల్లాలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ శ్రేణులు మధ్య ఉత్సాహంగా సాగుతోంది. రెండు రోజుల విరామం తరువాత ప్రారంభమైన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దినెలలుగా ఆమె ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయినా గురువారం (అక్టోబర్ 6,2022) రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో సోనియా పాల్గొన్నారు. కొడుకు రాహుల్ వెంట ఉత్సాహంగా నడుస్తూ ముందుకు అడుగులో వేస్తూ నడుస్తున్నారు.

Also read : Bharath Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న తల్లి సోనియా షూ లేస్‌లు కట్టిన రాహుల్ గాంధీ.. పాదయాత్రలో మరెన్నో అద్భుత దృశ్యాలు.. మీరూ చూడండి..

ఉత్సాహంగా కొనసాగుతున్న జోడో యాత్రలో రేపు అంటే అక్టోబర్ 7న రాహుల్ గాంధీ సోదరి..సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో కొనసాగనున్న జోడో యాత్రలో ప్రియాంక గాంధీ సోదరుడు..పార్టీ శ్రేణులతో కలిసి నడువనున్నారు.

కాగా..భారత్ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తల్లి సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోవడంతో రాహుల్ గమనించి లేస్‌లు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సోనియాగాంధీ పాదయాత్రలో రాహుల్ వెంట ఉత్సాహంగా పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొడుకు చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా సోనియాగాంధీ పాల్గొనడంతో, ఇద్దరు కలిసి స్థానిక ప్రజలకు కరచాలనం చేసుకుంటూ ముందుకు సాగడం చూసి కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.