పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

  • Published By: venkaiahnaidu ,Published On : March 7, 2019 / 01:31 AM IST
పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బుధవారం(మార్చి-6,2019) సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో 2018, డిసెంబరు 14న  ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపై బుధవారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురయ్యాయని  ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: ముషార్రఫ్ సంచలన నిజాలు : జైషే,ISIలు కలిసి భారత్ లో ఉగ్రదాడులు చేశాయి

దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ స్పందిస్తూ..పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో  కోర్టుకి వెల్లడించాలని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తుకి ఆదేశిస్తే దేశానికి భారీ నష్టం కలుగుతుందని..అందుకే ఇప్పటివరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు.అంతర్గత దర్యాప్తుకు యోచిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా భారత్-పాక్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావించిన వేణుగోపాల్..ఇటీవల మనదేశంపైకి ఎఫ్-16 యుద్ధ విమానాలు దాడికి వచ్చాయి.అలాంటి వాటి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు రాఫెల్ అవసరం ఎంతైనా ఉంది. మన మిగ్21లు ఎఫ్ 16లపై అద్భుతంగా పోరాడినప్పటికీ రాఫెల్ అవసరముంది.సెప్టెంబర్ నాటికి భారత అమ్ములపొదిలోకి రాఫెల్ వస్తుంది అని తెలిపారు. రక్షణ శాఖకు సంబంధించిన ఒప్పందాలపై న్యాయపరమైన సమీక్ష చేయడం తగదని ఏజీ అన్నారు.వాద, ప్రతివాదనలు విన్న అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.
Also Read: పుల్వామాలో ఎన్‌కౌంటర్ : ఇంటిని పేల్చేసి ఉగ్రవాదిని మట్టుబెట్టారు