Rahul Gandhi: రాహుల్ కాస్త సీరియస్‌గా ట్రై చేస్తే.. మొత్తం సీనే మారిపోతుందా?

దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్‌ని చూస్తోంది. అతనిలో.. ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా? అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే.. ఇంతే అనుకున్న వాళ్లందరికీ.. తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు.

Rahul Gandhi: రాహుల్ కాస్త సీరియస్‌గా ట్రై చేస్తే.. మొత్తం సీనే మారిపోతుందా?

Rahul Gandhi Popularity

Rahul Gandhi Popularity : రాహుల్ గాంధీ.. ఇండియాలో పాపులర్ పొలిటీషియన్. ఇప్పుడదే రాహుల్ గాంధీ పాపులారిటీ మరింత పెరిగింది. మొన్నటిదాకా ఎంపీగా మాత్రమే ఉన్న ఆయన.. ఇప్పుడు అనూహ్యంగా పీఎం రేసులోకి వచ్చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత జరిపిన సర్వేలో.. రాహుల్ గాంధీ గ్రాఫ్ బాగా పెరిగింది. జనంలోనూ.. ఆయనకు మంచి క్రేజ్ కనిపిస్తోంది. దీనంతటికీ.. రాహుల్‌లో వచ్చిన మార్పే కారణమా? అదే నిజమైతే.. రాహుల్‌లో వచ్చిన ఆ మార్పులేంటి? ఎన్నికల నాటికి.. రాహుల్ పాపులారిటీ మరింత పెరుగుతుందా? ఈసారి.. కాంగ్రెస్‌ (Congress)కు.. బీజేపీ (BJP).. గట్టి పోటీ ఇవ్వడం ఖాయమేనా? రాహుల్ కాస్త సీరియస్‌గా ట్రై చేస్తే.. మొత్తం సీనే మారిపోతుందా?

బీజేపీకి గట్టి పోటీ ఖాయమా?
నేషనల్ లెవెల్‌లో చేసిన ఓ సర్వే (Survey).. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జనం సమస్యల్ని తెలుసుకుంటూ.. స్పీచ్‌లు ఇరగదీస్తూ.. గతేడాది రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర (bharat jodo yatra).. పబ్లిక్‌ని బాగా ఆకట్టుకున్నట్లే అనిపిస్తోంది. అంతేకాదు.. ప్రధాని మోదీ (PM Modi)ని ఢీకొట్టగల నేతగానూ రాహుల్‌ని గుర్తిస్తున్నారని 19 రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే చెబుతోంది. ఈ లెక్కన.. రాహుల్ ఫుల్ యాక్టివ్ మోడ్‌ (active mode)లోకి వచ్చాక.. కేంద్ర రాజకీయాల్లో సీన్ మారుతున్నట్లే అనిపిస్తోంది. తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి దీటుగా కాంగ్రెస్ ఎదుగుతోందనే విషయం అర్థమవుతోంది. గత రెండు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్.. ఈసారి గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా.. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Result 2023)  తర్వాత.. హస్తం పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. క్యాడర్‌లోనూ ఓ నమ్మకం వచ్చింది. వీటికి.. విపక్షాల మద్దతు కూడా తోడైతే.. బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు కూడా వస్తున్నాయ్.

జోడో యాత్రతో రాహుల్ గ్రాఫ్ పెరిగిందా?
ఎన్డీటీవీ-లోక్‌నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో.. కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లు తేలింది. ఇదంతా.. రాహుల్ వల్లే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. భారత్ జోడో యాత్ర తర్వాత.. ఇండియాకు రాహుల్ మీద ఉన్న ఒపినీయన్ మారిపోయింది. ఇప్పుడు.. దేశం మొత్తం ఓ కొత్త రాహుల్‌ని చూస్తోంది. అతనిపై.. ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయ్. జోడో యాత్రకు ముందు చూసిన రాహుల్‌కి.. ఇప్పుడు ఇండియా చూస్తున్న రాహుల్‌కి.. చాలా తేడా కనిపిస్తోంది.

Rahul Gandhi Lorry
రాత్రంతా లారీలో ప్రయాణించి..

తాజాగా.. 250 కిలోమీటర్లు లారీలో ప్రయాణం చేసి అందరి అటెన్షన్‌ని గ్రాబ్ చేశారు రాహుల్. ఢిల్లీ నుంచి చండీఘర్ దాకా.. రాత్రి అంతా లారీలోనే జర్నీ చేశారు రాహుల్. లారీ క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్‌తో కలిసి ప్రయాణించి.. లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మధ్యలో దాబాల దగ్గర ఆగినప్పుడు.. అక్కడున్న ఇతర లారీ డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో.. రాహుల్ గాంధీ ప్రజల్లోకి దూసుకెళ్తున్న విధానం.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూనే.. ఆకట్టుకుంటోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేశాక.. రాహుల్ ఇమేజ్ బాగా పెరిగింది. తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ.. జనాలకు చేరువవుతున్నారు. అవే ఇప్పుడు.. జనమంతా అతని వైపు చూసేలా చేశాయనే విషయం.. తాజా సర్వేతో తేలిపోయిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు
నిజానికి.. ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటూ.. అప్పుడప్పుడు కేరళతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యక్షమయ్యే రాహుల్‌ని మాత్రమే ఇన్నాళ్లూ చూశారంతా. అతన్ని.. ఓ జాతీయ స్థాయి నాయకుడిగానే చూశారంతా. అధికార పార్టీపై ఆగ్రహావేశాలతో ఊగిపోయే.. సీరియస్‌ రాజకీయ నాయకుడిగానే భావించారు. కానీ.. దేశమంతా ఇప్పుడు అసలైన రాహుల్‌ని చూస్తోంది. అతనిలో.. ఇలాంటి రాజకీయ నేత దాగున్నాడా? అని ఆశ్చర్యపోతోంది. ఇప్పటిదాకా రాహుల్ గాంధీ అంటే.. ఇంతే అనుకున్న వాళ్లందరికీ.. తనను తాను సరికొత్తగా పరిచయం చేసుకున్నారు. అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు.

Also Read: వన్‌ ఆన్‌ వన్‌ పేరుతో.. నితీశ్ కుమార్ సరికొత్త వ్యూహం.. వర్కవుట్ అవుతుందా?

రాహుల్ గాంధీలో.. ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జనంతో అతను ఇంటరాక్ట్ అవుతున్న తీరు అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితో రాహుల్ మెలుగుతున్న తీరు, జనంతో కలుపుగోలుతనం కొత్త రాహుల్‌ను పరిచయం చేసింది. రాహుల్‌లో వచ్చిన మార్పును దేశం మొత్తం గమనిస్తోందనడానికి.. లేటెస్ట్ సర్వేనే ఎగ్జాంపుల్. భారత్ జోడో యాత్ర కంటే ముందు వరకు ప్రచారం జరిగినట్లు.. రాహుల్ ఇప్పుడు అమ్మచాటు బిడ్డ కానే కాదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రేమాభిమానాలతో కలుపుకొని పోయే నాయకుడని విశ్వసిస్తున్నారు. నిజానికి.. జోడో యాత్రతో ప్రజలను దగ్గర్నుంచి గమనించే అవకాశం రాహుల్‌కు వచ్చింది. అదే యాత్ర.. రాహుల్‌ని కూడా జనానికి దగ్గర చేసింది.

అనర్హత వేటుతో పెరిగిన పొలిటికల్‌ గ్రాఫ్
ఈ మధ్యకాలంలో.. బీజేపీపై రాహుల్ చేస్తున్న కామెంట్స్ కూడా విమర్శనాత్మకంగానే ఉంటున్నాయ్. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. బీజేపీ ప్రజలను ఇబ్బందులపాలు చేస్తోందంటూ.. జనానికి కనెక్ట్ అయ్యే డైలాగులు పేలుస్తున్నారు. ముఖ్యంగా.. అదానీ ఇష్యూతో రాహుల్ ఇండియా వైడ్ హాట్ టాపిక్‌గా మారారు. ఎంపీగా అనర్హత వేటుతో.. పొలిటికల్‌గా ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లోనూ.. రాహుల్ కూడా సహనం కోల్పోకుండా.. విద్వేషంతో కాదు ప్రేమతో ఈ దేశాన్ని ఏకం చేసేందుకే.. తానున్నానని చెబుతున్నారు. దాంతో.. దేశ ప్రజల్లో రాహుల్‌పై ఉన్న అభిప్రాయం కూడా క్రమంగా మారుతున్నట్లు అనిపిస్తోంది.

Also Read: ఆలింగనాలతో దేశాధినేతలను కట్టిపడేసిన ప్రధాని.. మోదీ హగ్‌ దౌత్యం ఫలిస్తుందా?

సమస్యలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు.. ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ రాహులే. అతని వరకు ఇది.. పెద్ద సవాలే అయినా.. స్వీకరించారు. రోజుకో విధంగా ఎదుగుతూ వస్తున్నారు. దాంతో.. ఈసారి నేషనల్ లెవెల్‌లో కచ్చితంగా.. కొంత మార్పు చూడబోతున్నామనే టాక్ కూడా మొదలైంది. కాంగ్రెస్ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలంతా.. పార్టీకి పునర్వైభవం వస్తుందని బలంగా నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే.. రాహుల్ వేస్తున్న అడుగులు.. బీజేపీలో వణుకు పుట్టిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

పుంజుకున్న కాంగ్రెస్..
అయితే.. తాజా సర్వేలో.. బీజేపీ బలం కాస్త తగ్గగా.. కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగైంది. లేటెస్ట్ సర్వేలో.. 43 శాతం మంది బీజేపీకి మద్దతుగానే ఉన్నారు. కాంగ్రెస్‌ కూడా 10 శాతం ఓట్ బ్యాంక్ పెంచుకొని.. 29 శాతానికి చేరింది. ఒకేసారి పది శాతం పెరగడమనేది.. అంత చిన్న విషయం ఏమీ కాదు. పైగా.. మున్ముందు.. ఇది మరింత పెరుగుతుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. అలాగే.. ప్రధానమంత్రి విషయంలోనూ.. 43 శాతం మంది మోదీకే మద్దతు తెలిపారు. 27 శాతం మంది రాహుల్‌కు సపోర్ట్‌గా నిలిచారు. మొత్తానికి.. రాహుల్ ఇప్పుడు పీఎం రేసులోకి వచ్చేశారు. ఈ పరిస్థితులు.. ఎన్నికల నాటికి ఎలా మారతాయన్నదే.. ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

రాహుల్‌కు మూడు లక్ష్యాలున్నాయ్.. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి..