Rahul Gandhi : పార్లమెంట్‌లో ప్రతిష్టంభన.. విపక్ష నేతలని అల్పాహార విందుకి ఆహ్వానించిన రాహుల్

పార్లమెంట్​ లో ప్రతిష్ఠంభణ  నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Rahul Gandhi : పార్లమెంట్‌లో ప్రతిష్టంభన.. విపక్ష నేతలని అల్పాహార విందుకి ఆహ్వానించిన రాహుల్

Rahul

Rahul Gandhi  పార్లమెంట్​ లో ప్రతిష్ఠంభణ  నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పార్లమెంట్ కి దగ్గర్లోని కాన్​స్టిట్యూషన్ క్లబ్​లో అల్పాహార విందుకు రావాలని విపక్ష నేతలను రాహుల్ ఆహ్వానించారు. అన్ని విపక్ష పార్టీల ఎంపీలు, ఫ్లోర్ లీడర్లను అల్పాహార విందుకు ఆహ్వానించారు. కొంతకాలంగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఇలాంటి అన్ని సమావేశాలకు గైర్హాజరవుతున్న టీఎంసీకి సైతం ఆహ్వానం అందించినట్లు సమాచారం.

కాగా, పెగసస్, ధర పెరుగుదల,నూతన వ్యవసాయ చట్టాలు సహా వివిధ సమస్యలపై చర్చించాలని ప్రతి రోజూ విపక్ష పార్టీలు పార్లమెంట్ ​లో డిమాండ్ చేస్తున్నాయి. వీటిపై చర్చించేందుకు వీలుగా పార్లమెంట్​లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెడుతున్నాయి. అయితే, కేంద్రం మాత్రం పెగసస్ వ్యవహారం అసలు సమస్యే కాదని చెబుతోంది. ఈ నేపథ్యంలో పెగసస్ వ్యవహారంపై మోదీ సర్కార్ ని ఇరుకున పెట్టే విధంగా సంయుక్త వ్యూహాన్ని రచించడం సహా ఎన్​డీఏ సర్కారును ఇరుకున పెట్టేందుకు వివిధ అంశాల్లో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేలా ఈ సమావేశంలో చర్చలు జరపనున్నట్లు సీనియర్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు తెలిపారు. అంతేకాకుండా విపక్ష పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన మార్చ్ నిర్వహించనున్నారని,పార్లమెంట్ వరకూ ఎంపీలు నడుచుకుంటూ వెళ్తనున్నట్లు సమాచారం.