అనుమతిస్తారా? : వలసకూలీల బ్యాగ్ లు మోస్తూ…యూపీ దాకా నడుస్తానన్న రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 27, 2020 / 05:51 AM IST
అనుమతిస్తారా? : వలసకూలీల బ్యాగ్ లు మోస్తూ…యూపీ దాకా నడుస్తానన్న రాహుల్

డ్రామాబాజీ అంటూ తనను విమర్శించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ కు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో..స్వస్థలాకు చేరుకునేందుకు కాలినడకతో రోడ్లపై వందల కిలోమీటర్లు ప్రయాణిస్తున్న వలసకార్మికులను రాహుల్ గాంధీ కలిశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. అయితే రాహుల్  వలసకూలీలను కలవడంపై నిర్మలా సీతారామన్ సెటైర్లు వేశారు. రాహుల్ ను డ్రామాబాజీగా ఆమె అభివర్ణించారు.

ఇంటికి వెళ్తున్న వలస కార్మికులను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారు. వలస కార్మికులను ఆపి మాట్లాడుతున్నారు. దీని వల్ల వలస కార్మికుల సమయం వృధా అవుతంది. వాళ్లు చాలా దూరం నడవాలి. వలస కూలీలతో పాటు వారు నడవ గలిగితే వాళ్ల చిన్న పిల్లల్ని ఎత్తుకుని, వాళ్ల సూట్ కేసులు,బ్యాగ్ లు పట్టుకుని నడవండి అంటూ నిర్మలమ్మ వ్యాఖ్యానించింది.

తనను ”డ్రామాబాజీ” అని నిర్మలా సీతారామన్ విమర్శించడం పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. నిర్మల కోరితే… యుపి వరకు నడిచి వెళ్ళడానికి కూడా తానూ సిద్ధం గా ఉన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. మంగళవారం వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన రాహల్ గాంధీ.. నిర్మలా సీతారామన్ కోరితే ఉత్తరప్రదేశ్ వరకు నడిచి వెళ్లడానికి నేను సిద్ధమే. నాకు అనుమతి ఇస్తారా? అని ప్రశ్నించారు. దేశపు బలం వలసకూలీలు అని రాహుల్ అన్నారు. వారిని కలవడం వల్ల వారి సమస్యను హైలెట్ చేయగలనని అనుకున్నట్లు రాహుల్ అన్నారు.
 
మరోవైపు నిర్మలా వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. వలస కార్మికులు నడిచి వెళ్తుంటే… వారికీ సదుపాయాలు కల్పించకపోగా.. రిని నడవనివ్వండని తమను అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. వలస కార్మికులను భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా అవమానించదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు. మరోవైపు నిర్మల సీతారామన్ వారికి క్షమాపణలు చెప్పాలంటూ… కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు

Read: కరోనా చికిత్సకు తక్కువ ధరకే వెంటిలేటర్.. భారత అమెరికన్ దంపతుల అద్భుత సృష్టి