IRCTC : ట్రైన్‌లో వాటర్ బాటిల్‌ ఎమ్మార్పీ కంటే రూ.5 ఎక్కువ అమ్మినందుకు రూ.లక్ష జరిమానా..

ట్రైన్‌లో వాటర్ బాటిల్‌ ఎమ్మార్పీ కంటే రూ.5 ఎక్కువ తీసుకున్నందుకు రూ.లక్ష జరిమానా విధించారు అధికారులు.

IRCTC : ట్రైన్‌లో వాటర్ బాటిల్‌ ఎమ్మార్పీ కంటే రూ.5 ఎక్కువ అమ్మినందుకు రూ.లక్ష జరిమానా..

IRCTC

IRCTC : రైలు ప్రయాణం ఎంత సౌకర్యమో..రైలు అమ్మే కూల్ డ్రింకులు,వాటర్ బాటిల్స్ తో పాటు ఆహార పదార్ధాలు మాత్రం ఖరీదుగానే ఉంటాయి. ముఖ్యంగా వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, ఫుడ్ ఐటెమ్స్ వంటివి ప్రైవేటు వ్యక్తులు కాంట్రాక్ట్ తీసుకుని అమ్ముతుంటారు. దీంతో వారు ప్రయాణీకుల నుంచి దోపిడీ చేస్తుంటారు. ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువే తీసుకుంటారు.బాటిల్స్ పై ఉండే ఎమ్మార్పీ రేట్ల కంటే ఐదారు రూపాయలు ఎక్కువగానే తీసుకుంటారు?అదేమని ప్రశ్నిస్తే అది అంతే మీకిష్టముంటే తీసుకోండీ లేకుంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు.కానీ అవసరం మనది కాబట్టి వేరే దారి లేక కొనాల్సి వస్తుంది. దాన్ని అలుసుగా తీసుకుని వారికిష్టమొచ్చిన రేట్లకు అమ్ముతూ ప్రయాణీకుల జేబులు గుల్ల చేస్తుంటారు. చాలామంది ఇది సర్వసాధారణమే వేరే దారి లేదు కాబట్టి కొంటాం..వారితో మనకెందుకు గొడవ..ఒకవేళ గొడవ పెట్టుకున్నా ఒరిగేది ఉండదని కొనేస్తుంటారు. అలా రైలులో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అమ్మేవారి దోపిడీ కొనసాగుతుంటుంది.

కానీ అందరూ ఊరుకున్నట్లుగా కొందరు ఊరుకోరు. స్వానుభవంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. గురువారం (డిసెంబర్15,2022) ఛండీగడ్ నుంచి షాజహాన్ పూర్ కు వెళుతున్న లక్నో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించే శివంభట్ అనే ప్రయాణీకుడు రైలు ప్రయాణం మధ్యలో దాహమేసింది. ఓ వాటర్ బాటిల్ కొనటానికి అమ్మే వ్యక్తిని పిలిచాడు. బాటిల్ ఎంత అని అడిగాడు. రూ.20లు అని చెప్పాడా వ్యక్తి. దానికి శివం అదేంటీ బాటిల్ పై ఎమ్మార్పీ ధర రూ.15 ఉంటే రూ.20 చెబుతావేంటి? అని ప్రశ్నించాడు.దానికి సదరు వ్యక్తి కావాలంటే తీసుకో, లేదంటే మానేయ్ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. కానీ దాహమేస్తోంది. రైలు దిగి వెళ్లి తెచ్చుకునే సమయంలేదు. దీంతో వేరే దారిలేక రూ.20లు ఇచ్చి వాటర్ బాటిల్ కొన్నాడు. కానీ ఈ దోపిడీ ఇలాగే కొనసాగకూడదని అనుకున్నాడు.

జాగ్రత్తగా వీడియో తీశాడు.ఈ వీడియోను రైల్వే ఉన్నతాధికారులకు పంపించాడు. ఇలా అయితే ప్రయాణికులకు చాలా ఇబ్బంది దయచేసి ఇటువంటి దోపిడీపై చర్యలు తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారి రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో మేనేజర్ దినేష్ స్పందించారు. రైల్వే చట్టంలోనే సెక్షన్ 144(1)కింద లక్నో ఎక్స్ ప్రెస్ లో వాటర్ బాటిల్స్ అమ్మకానికి లైసెన్స్ పొందిన మేనేజర్ రవి కుమార్‌ను అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్ కు రూ.లక్ష జరిమానా విధించారు.