సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి పొండి..లేదా సముద్రంలో దూకండి: బీజేపీ నేత వ్యాఖ్యలు  

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 09:41 AM IST
సీఏఏ నచ్చకుంటే దేశం విడిచి పొండి..లేదా సముద్రంలో దూకండి: బీజేపీ నేత వ్యాఖ్యలు  

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్యతిరేకిస్తూ దేశంలో అల్లర్లు సృష్టిస్తున్నారో..ఆందోళనలు చేస్తున్నారో దేశానికి సంబంధించి ఆస్తుల్ని తగులబెడుతున్నారో..పోలీసులపై దాడులు చేస్తున్నారో అటువంటి నిరసనకారులను ఎవరైతే సమర్థిస్తున్నారో వారంతా ఈ దేశానికి శత్రువులేనని ఆయన వ్యాఖ్యానించారు.

వారికి జాతీయ పౌరసత్వ చట్ట సవరణ నచ్చకుంటే  పాకిస్థాన్ కు వెళ్లిపోవచ్చనీ..లేదంటే బంగ్లాదేశ్ కు..ఆఫ్ఘనిస్తాన్ ఇలా వారికి నచ్చిన దేశానికి వెళ్లిపోండి…ఆయా దేశాలవారు ఒప్పుకోకుంటే హిందూ మహా సముద్రంలో దూకండి అంటూ వివాదాస్ప వ్యాఖ్యలు చేసారు మదన్ దిలావర్. వారు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అయినా కావొచ్చన్నారు.వారికి సీఏఏ నచ్చకుంటే వారుకూడా వెళ్లిపోవచ్చని అన్నారు. సీఏఏను వ్యతిరేకించేవారికి ఈ దేశంలో నివసించే హక్కు లేదని మదన్ దిలావర్ వ్యాఖ్యానించారు.

వారికి పాకిస్తాన్ అంటే ప్రేమ ఉంటే అక్కడికి వెళ్లాలని, బంగ్లాదేశ్‌ నచ్చితే అక్కడికి కూడా వెళ్లొచ్చని.. ఈ రెండు దేశాలు వారిని తమ దేశాల్లోకి అనుమతించకపోతే సముద్రంలో దూకాలని సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి మదన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై చర్చనీయాంశంగా మారాయి.