Rajasthan : పసిబిడ్డ ప్రాణం తీసిన ప్రభుత్వం రూల్ .. ఉద్యోగం కోసం 5నెలల బిడ్డను కాలువలో పడేసిన దంపతులు

కన్నబిడ్డల కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే తల్లిదండ్రులుంటారు. కానీ ఉద్యోగం కోసం కన్నబిడ్డను పైగా ఐదు నెలల పసిగుడ్డును అంత్యంత అమానవీయంగా కాలువలో పడేసారు తల్లిదండ్రులు.

Rajasthan : పసిబిడ్డ ప్రాణం తీసిన ప్రభుత్వం రూల్ .. ఉద్యోగం కోసం 5నెలల బిడ్డను కాలువలో పడేసిన దంపతులు

Rajasthan man throws Five month old baby child

Rajasthan man throws Five month old baby child  : కన్నబిడ్డల కోసం ప్రాణాలను కూడా పణంగా పెట్టే తల్లిదండ్రులుంటారు. కానీ ఉద్యోగం కోసం కన్నబిడ్డను పైగా ఐదు నెలల పసిగుడ్డును అంత్యంత అమానవీయంగా కాలువలో పడేసిన తండ్రి గురించి తెలిస్తే వీడసలు తండ్రేనా? అని కాదు అసలు మనిషినా? అనిపిస్తుంది. ఓ కన్నతండ్రి తను చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ అవ్వాలని కన్నబిడ్డను కాలువలో పారేసిన ఘటన రాజస్థాన్ లోని బికనీర్ లో చోటుచేసుకుంది. బిడ్డను చంపేస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ ఎలా అవుతుంది? ఇదేమీ దారుణం అనే అనుమానం వస్తుంది కదూ..ఎందుకంటే ఇది రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూల్.

మూడో బిడ్డ ఉంటే ఆ ఉద్యోగి వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని అనే నిబంధన పెట్టింది రాజస్థాన్ ప్రభుత్వం. దీంతో తనకు పుట్టిన మూడో బిడ్డను కాలువలో పారేశాడు. బిడ్డను కాలువలో పారేయటానికి తల్లికూడా అంగీకరించటం మరో దారుణం. ఆదివారం (జనవరి 22,2023) సాయంత్రం జరిగిన ఈ దారుణం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సదరు ఉద్యోగితో పాలు బిడ్డను చంపేయటానికి అంగీకరించిన అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారు మూడో సంతానానికి జన్మనిస్తే.. ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఈ రూల్ ను కఠినంగా అమలు చేస్తోంది. దీంతో కన్నబిడ్డను కాలువలో పారేసి వదిలించుకున్నారా తల్లిదండ్రులు.

బికనీర్ కు చెందిన 36 ఏళ్ల జవార్ లాల్ మేఘ్వాల్ అనే వ్యక్తి ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంట్ అవుతుందనే ఆశతో పనిచేస్తున్నాడు. మేఘ్వాల్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే మేఘ్వాల్ భార్య మూడో బిడ్డకు జన్మినిచ్చింది. మూడో బిడ్డగా ఆడపిల్ల పుట్టి ఐదు నెలలు అయ్యింది. ఈక్రమంలో మూడో బిడ్డ ఉంటే ప్రభుత్వ ఉద్యోగి అర్హత ఉండదనే విషయం ఇటీవలే తెలిసింది. దీంతో మేఘ్వాల్ ఆందోళన పడిపోయారు. తన ఉద్యోగం పర్మినెంట్ అవ్వాలంటే మూడో బిడ్డ ఉండకూడదనుకున్నాడు. అదే విషయం భార్యకు చెప్పాడు. ఇద్దరు కలిసి బిడ్డను వదిలించుకోవాలనుకున్నారు.

అలా ఆ ఐదు నెలల పసికందును తీసుకెళ్లి ఛత్తార్ గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలువలో పారేసి వచ్చారు. నెలల పసికందు మరణానికి కారణమైన ఆ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఉద్యోగం పర్మినెంట కోసం నిందితులు భార్యతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడని బికనీర్ పోలీసు సూపరింటెండెంట్ యోగేష్ యాదవ్ తెలిపారు. మేఘ్వాల్, భార్య గీతా దేవిపై ఛతర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 302 మరియు 120B కింద కేసు నమోదు చేసామని వారిద్దరిని విచారిస్తున్నామని తెలిపారు.