Divya Spandana: నేను ఏ తప్పు చేయలేదు.. మాజీ ఎంపీ రమ్య ఆవేదన

కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన (రమ్య)ను కాంగ్రెస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు ...

Divya Spandana: నేను ఏ తప్పు చేయలేదు.. మాజీ ఎంపీ రమ్య ఆవేదన

Ramya

Divya Spandana: కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన (రమ్య)ను కాంగ్రెస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతు దారులు వర్సెస్ రమ్యగా సోషల్ మీడియాలో మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో రమ్య తనపై శికుమార్ మద్దతు దారులు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని శివకుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను ఆదేశించారంటూ రమ్య ట్విటర్ లో తెలిపింది. ఇంతకీ శివకుమార్ వర్సెస్ రమ్య మధ్య ఈ వివాదం తలెత్తడానికి కారణం.. రమ్యానే అంటూ పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Karnataka: కర్ణాటకలో మతమార్పిడి నిరోధక ఆర్డినెన్స్

ఇటీవల పోలీస్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో బహిరంగ వేదికలపై తనను ప్రశ్నించకుండా రక్షణ కోరుతూ ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణన్ కాంగ్రెస్ నాయకుడు ఎంబీ పాటిల్‌ను కలిశారని శివకుమార్ ఆరోపించాడు. ఈ క్రమంలో శివకుమార్ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఎంబీ పాటిల్ నిబద్దత కలిగిన కాంగ్రెస్ వాది అని, పార్టీలకు అతీతంగా నాయకులు కలుసుకోవడం తప్పేంటంటూ రమ్య ట్విటర్ వేదికగా ప్రశ్నించింది. దీంతో శివకుమార్ మద్దతు దారులు.. ఇన్నాళ్లు ఏమైపోయావు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఇన్నాళ్లకు మేల్కొన్నావా అంటూ రమ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Karnataka : అగ్నికేళి.. ఒకరిపై ఒకరు కాగడాలు విసురుకున్నారు

శివకుమార్ మద్దతు దారుల ట్రోల్స్ తీవ్ర ఆగ్రహానికి గురైన రమ్య.. నేను బయటికి వచ్చాక నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి 8కోట్లు తీసుకొని పారిపోయారంటూ ఓ కన్నడ టీవీ ఛానెల్ లో తప్పుడు ప్రచారం చేయించారని, నేను 8కోట్లు తీసుకోలేదని, పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానంటూ రమ్య పేర్కొంది. ఇన్నాళ్లు నిశబ్దంగా ఉండటమే నా తప్పయిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరి వద్ద డబ్బు తీసుకోలేదంటూ రమ్య ట్విట్ చేసింది.