Covid-19 : దేశంలో పెరిగిన రికవరీ రేటు.. 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కేసులు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి.

Covid-19 : దేశంలో పెరిగిన రికవరీ రేటు.. 36 వేల కేసులు.. 38 వేల రికవరీలు

Covid 19

Covid-19 : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజువారి కేసులు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 36,083 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 493 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 4,31,225కి చేరింది. ఇక శనివారం దేశ వ్యాప్తంగా 19,23,863 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

ఇక శనివారం కరోనా నుంచి కోలుకొని 37,927 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కి చేరింది. ఇక రికవరీ రేటు 97.46%కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,85,336(1.20శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 73,50,553 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 54,38,46,290కి చేరింది. ఈ ఏడాది చివరి నాటికి టీకా పంపిణి పూర్తి చేయాలనీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.