Currency Notes: కరెన్సీ నోట్లపై నేతాజీ ఫొటో.. అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్

దేశంలో కరెన్సీ నోట్లపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ముద్రించాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. గాంధీజీ ఫొటో స్థానంలో, నేతాజీ ఫొటో ముద్రించాలని కోరింది. ఈ డిమాండ్‍ను పలువురు తప్పుబడుతున్నారు.

Currency Notes: కరెన్సీ నోట్లపై నేతాజీ ఫొటో.. అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్

Currency Notes: దేశంలోని కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో బదులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ముద్రించాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. కోల్‌కతాలో జరిగిన ఒక మీడియా సమావేశంలో పశ్చిమ బెంగాల్‪కు చెందిన అఖిల భారత హిందూ మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి ఈ డిమాండ్ చేశారు.

India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు

‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీ పోరాటానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం ఏమాత్రం తీసిపోదు. అలాంటి నేతాజీని మనం గౌరవించుకోవాలంటే కరెన్సీ నోట్లపై ఆయన ఫొటో ముద్రించాలి. గాంధీ ఫొటో స్థానంలో నేతాజీ ఫొటోను ముద్రించాలి’’ అని గోస్వామి అన్నారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యల్ని పలువురు తప్పుబడుతున్నారు. కాగా, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఒక దుర్గా మండపంలో మహాత్మా గాంధీని పోలిన రాక్షసుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది

దీనిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, దీనిపై నిర్వాహకులు సమాధానం ఇచ్చారు. మహాత్మా గాంధీని పోలిన రాక్షస విగ్రహాన్ని తాము కావాలని తయారు చేయలేదని, దీనిపై అవనసరంగా వివాదం సృష్టిస్తున్నారని నిర్వాహకులు అన్నారు. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా స్పందించారు. మహాత్మా గాంధీని అలా అవమానించడం సిగ్గు చేటని, ఆయన్ను అందరూ గౌరవించాలని మమత అన్నారు.