Rs 1000 Notes: వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?

వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రాబోతున్నట్లు మీకేమైనా మెసేజ్ వచ్చిందా? మీ సోషల్ మీడియా ఖాతాకు అలాంటి సందేశం గానీ వచ్చిందా? దీనిపై మీకేమైనా సందేహాలున్నాయా? అయితే.. ఈ వివరాలు తెలుసుకోండి.

Rs 1000 Notes: వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తున్నాయా.. సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత?

Rs 1000 Notes: ఆరేళ్లక్రితం బ్యాన్ అయిన రూ.1,000 నోట్లు మళ్లీ వస్తున్నాయా? దీనిపై సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ప్రచారం సాగుతోంది. రూ.2,000 కరెన్సీ నోట్లను ఆర్బీఐ చాలా కాలంగా ముద్రించడం లేదని ఇటీవలే పార్లమెంట్‌లో బీజేపీ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతికి ఆరు వేల బస్సులు నడపనున్న ఏపీఎస్ ఆర్టీసీ

దీని ప్రకారం ఇకపై కొత్త రెండు వేల రూపాయల నోట్లు రావని, త్వరలోనే వాటిపై నిషేధం ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో రెండు వేల రూపాయల నోట్ల స్థానంలో తిరిగి వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. వచ్చే జనవరి 1 నుంచి ఈ నోట్లు విడుదలవుతాయని వార్త ప్రచారమవుతోంది. ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అనే సంస్థ వివరాలు ఆరా తీసింది. ఈ సంస్థ వివిధ ప్రభుత్వ పథకాలపై జరుగుతున్న ప్రచారంపై వివరాలు సేకరించి, వాస్తవాలు తెలియజేస్తుంది. ఎవరికైనా సందేహాలుంటే వారికి తెలియజేసినా స్పందిస్తుంది. ఈ మేరకు వెయ్యి రూపాయల నోట్లు తిరిగి వస్తాయని జరుగుతున్న ప్రచారంపై కూడా స్పందించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సంస్థ తెలిపింది.

Telangana: తెలంగాణ అప్పులు రూ.2.67 లక్షల కోట్లు.. వెల్లడించిన కేంద్రం

వెయ్యి రూపాయల నోట్లు తిరిగి రావడం లేదని, ఇదంతా ఫేక్ ప్రచారమని తేల్చింది. ఈ అంశంపై వచ్చే ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దని నెటిజన్లను కోరింది. కాగా, ఇప్పటివరకు రూ.2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అందువల్ల ఈ నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయి. వీటిని కూడా త్వరగా మార్చుకోవాలనే ప్రచారాన్ని కూడా నమ్మొద్దని పీఐబీ సూచించింది.