#UnionBudget2023: రైల్వేకు రూ.2.40 లక్షల కోట్ల కేటాయింపు… 2013-2014 కంటే 9 రెట్లు అధికం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు (మూలధన వ్యయం) కేటాయించారు. ఇది 2013-2014లో (యూపీఏ హయాంలో) ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కన్నా తొమ్మిది రెట్లు అధికం. ఇక గత ఏడాది కేంద్ర బడ్జెట్-2022లో రైల్వేకు రూ.1,40,367.13 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

#UnionBudget2023: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు (మూలధన వ్యయం) కేటాయించారు. ఇది 2013-2014లో (యూపీఏ హయాంలో) ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ కన్నా తొమ్మిది రెట్లు అధికం. ఇక గత ఏడాది కేంద్ర బడ్జెట్-2022లో రైల్వేకు రూ.1,40,367.13 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
కేంద్ర బడ్జెట్-2021లో రైల్వేకు రూ.1,10,055 కోట్లు కేటాయించారు. గత ఏడాది దేశంలో 400 వందే భారత్ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతామని ప్రకటించింది. ప్రతి ఏడాది రైల్వే బడ్జెట్ ను భారీగా పెంచుకుంటూ వస్తున్నారు. గత ఏడాదితో పోల్చి ఈ సారి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు పెంచడం గమనార్హం. ఈ బడ్జెట్ ను దేశంలో రైళ్లు ఇంజన్లు, సరుకు రవాణా, అధునాతన కోచ్‌లు, సాంకేతికత, ట్రాకుల పునరుద్ధరణ, గేజ్ మార్పిడి, డబ్లింగ్, కొత్త లైన్ల కోసం ఉపయోగిస్తారు.
మరోవైపు, దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు భారీగా కేటాయింపులు చేశారు. 63,000 సొసైటీల కంప్యూటరీకరణ కోసం రూ.2,516 కోట్లు కేటాయించారు. దేశంలో ప్రత్యామ్నాయ ఎరువుల ప్రోత్సాహం కోసం గోవర్ధన్ జాతీయ పథకాన్ని తీసుకురానున్నారు. మహిళల కోసం మరిన్ని పథకాలను కేంద్రం ప్రకటించింది. 81 లక్షల సెల్ప్ హెల్ గ్రూపులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. కాగా, దేశంలో రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ.75 వేల కోట్లు కేటాయించింది.
#UnionBudget2023: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్: నిర్మలా సీతారామన్