Supreme Court: అందరికీ ఒకే పెళ్లి వయసు విషయంలో మీ వైఖరేంటి.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

వివాహ వయస్సు విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరి చెప్పాలని సుప్రీంకోర్టు సూచించింది. మతం, పర్సనల్ లాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ వయస్సు ఉండేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది.

Supreme Court: అందరికీ ఒకే పెళ్లి వయసు విషయంలో మీ వైఖరేంటి.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Supreme Court: అందరికీ ఒకే పెళ్లి వయసు (యునిఫామ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్) విషయంలో కేంద్రం వైఖరి ఏంటో స్పష్టం చేయాలని సూచించింది భారత సుప్రీంకోర్టు. ఏ మతంతో, పర్సనల్ ‘లా’తో సంబంధం లేకుండా ‘యునిఫామ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్’ అమలు చేయాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Twitter: 150 కోట్ల అకౌంట్లు బ్యాన్ చేయనున్న ట్విట్టర్.. కారణమిదే!

దేశంలోని చట్టాలకు అనుగుణంగా ముస్లిం పర్సనల్ లాలోని వివాహ వయస్సు నిబంధనలో మార్పులు తేవాలని, పెళ్లి చేసుకునే వయసు పెంచాలని పిటిషన్‌లో కోరారు. దీనిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై. చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అన్ని కులాలు, మతాలకు సంబంధించి మహిళల పెళ్లి వయసును కనీసం 18 ఏళ్లుగా నిర్ణయించాలని మహిళా కమిషన్ తన పిటిషన్‌లో కోరింది. మన దేశంలో చట్టం ప్రకారం మగవాళ్లు 21 సంవత్సరాలు దాటిన తర్వాత, మహిళలు 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. కానీ, ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆడవాళ్లు కౌమారత్వంలోకి ప్రవేశించి, 15 ఏళ్లు వస్తే చాలు.. పెళ్లి చేసుకోవచ్చు.

Indian Citizenship: భారత పౌరసత్వం వదులుకున్న 16 లక్షల మంది.. పదకొండేళ్ల వివరాలు చెప్పిన కేంద్రం

అయితే, 18 సంవత్సరాల వయసు రాని ముస్లిం మహిళల్ని పెళ్లి చేసుకున్న వారికి శిక్ష పడేలా చూడాలని మహిళా కమిషన్ సూచించింది. పోక్సో చట్టం ప్రకారం.. 18 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న అమ్మాయిలతో శృంగార చర్యకు పాల్పడటం నేరం. అయితే, 18 సంవత్సరాలకంటే తక్కువ వయసు కలిగిన అమ్మాయిల అనుమతితో శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని చట్టం చెబుతోంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం మగవాళ్లు 21 సంవత్సరాలకంటే ముందు, ఆడవాళ్లు 18 సంవత్సరాలకంటే ముందు పెళ్లి చేసుకుంటే బాల్య వివాహంగా పరిగణిస్తారు.