Special Trains From Secunderabad : సికింద్రాబాద్ నుంచి అగర్తల, రామేశ్వరానికి ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి  దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.

Special Trains From Secunderabad :  సికింద్రాబాద్ నుంచి అగర్తల, రామేశ్వరానికి ప్రత్యేక రైళ్లు

Scr Special Trains

Special Trains From Secunderabad :  దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో సికింద్రాబాద్‌ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు నడపడానికి  దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అక్టోబరు 18న సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి అగర్తల కు రైలు (07030), అక్టోబరు 21న ఉదయం 6.10 గంటలకు అగర్తల నుంచి సికింద్రాబాద్‌కు రైలు (07029) బయలుదేరుతుందని చెప్పారు.

కాగా, సికింద్రాబాద్‌ అగర్తల ప్రత్యేక రైళ్లు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, బెర్హంపూర్‌, ఖుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలసోర్‌, ఖరగ్‌పూర్‌, దంకుని, రాంపూర్‌ హట్‌, మల్దాటౌన్‌, కిషన్‌గంజ్‌, న్యూ జలపాయిగురి, న్యూ కూచ్‌ బెహార్‌, న్యూ అలిపురందర్‌, న్యూ బంగోయ్‌గాన్‌, వయా గాల్‌పరా టౌన్‌, కామాఖ్య, గువాహటి, న్యూ హాఫ్‌లాంగ్‌, బదర్‌పూర్‌ జంక్షన్‌, న్యూకరీంగంజ్‌, ధర్మసాగర్‌, అంబసా స్టేషన్స్‌ల మీదుగా నడుస్తాయని పేర్కొన్నారు.

Also Read : Sunday Funday At Charminar : రేపటి నుంచి చార్మినార్ వద్ద సాయంత్రం పూట “సండే-ఫన్‌డే

మరోక రైలు …రామేశ్వరం-సికింద్రాబాద్‌ల మధ్య నడిచే ప్రత్యేక రైలు అక్టోబరు 21, 28, నవంబరు 4, 11, 18, 25, డిసెంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో నడుస్తుందని తెలిపారు. సికింద్రాబాద్‌- రామేశ్వరం ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, మనమదురై జంక్షన్‌ల మీదుగా నడుస్తాయి.