Viral Video: ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ.. ఈ వీడియోచూస్తే మీరూ అలానే అంటారు..

ప్రస్తుత సమాజంలో 60ఏళ్లు దాటిన చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక 70ఏళ్లు దాటాయంటే అధికశాతం మంది వృద్ధులు మంచానికే పరిమితం అవుతున్నారు. కానీ హర్యానాలోని ఓ 73ఏళ్ల వృద్ధురాలు మాత్రం.. 73ఏళ్ల యంగ్ లేడీగా మారిపోయింది. ఆమె చేసే సాహసాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Viral Video: ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ.. ఈ వీడియోచూస్తే మీరూ అలానే అంటారు..

Old Ladey

Viral Video: ప్రస్తుత సమాజంలో 60ఏళ్లు దాటిన చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక 70ఏళ్లు దాటాయంటే అధికశాతం మంది వృద్ధులు మంచానికే పరిమితం అవుతున్నారు. కానీ హర్యానాలోని ఓ 73ఏళ్ల వృద్ధురాలు మాత్రం.. 73ఏళ్ల యంగ్ లేడీగా మారిపోయింది. ఆమె చేసే సాహసాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వృద్ధురాలి సాహసాలు వీక్షించిన నెటిజన్లు వామ్మో.. ఆమె వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ అంటూ కితాబిచ్చేస్తున్నారు.

హర్యానాలోని సోనేపట్ కు చెందిన 73ఏళ్ల వృద్ధురాలు చేసే సాహసాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆ వృద్ధురాలి పేరు ఓంవతి. హర్యానాలోని బందేపూర్ గ్రామంలో నివాసం ఉంటుంది. ఓంవతి ఇప్పటికీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనేక సాహసాలు చేస్తూ స్థానికులచేత వావ్ అనిపించుకుంటుంది. తాజాగా ఓంవతి గంగానదిలోకి బ్రిడ్జిపై నుంచి దూకింది. హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వద్ద 40అడుగుల ఎత్తైన వంతెనపై నుంచి ఆమె నదిలోకి దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ సమయంలో ఆమె నదిలోకి బ్రిడ్జి పైనుంచి దూకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఈ ఘటనను స్థానికులు వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు కొంతమంది వృద్ధురాలి ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు ఆమె భద్రత గురించి ఆందోళన చెందుతూ రీట్వీట్లు చేశారు. మరికొందరు ఆమె 73ఏళ్ల వృద్ధురాలు కాదు.. 73ఏళ్ల యంగ్ లేడీ అంటూ ప్రసంశిస్తూ ట్వీట్లు చేశారు.

ఈ విషయంపై ఓంవతి మాట్లాడుతూ.. నేను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని, తనవెంట ఎవరూ లేకుండానే ఈతకొడుతూ ఒడ్డుకు వస్తుంటానని తెలిపింది. నాకు చిన్నప్పటి నుంచి నదులు, చెరువులు, వాగుల్లో ఈత కొట్టడం అలవాటు ఉండటం వల్ల తనకు ఎలాంటి భయం అనిపించదని ఓంవతి తెలిపింది. బందేపూర్ గ్రామంలో నివాసం ఉంటున్న ఓంవతికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బోరిస్ A.K.A బ్రెడ్ & సర్కస్ పేరుతో కలిగిన వ్యక్తి.. తన ట్విటర్ ఖాతాలో ఓంవతి డ్యాన్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్.. ఓంవతి అంటూ కితాబిస్తున్నారు.