తీర్పు ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

10TV Telugu News

తీర్పు ఒకరి గెలుపు కాదు, ఒకరి ఓటమి కాదు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అయోధ్యలోని  వివాదాస్పద రామజన్మ భూమి  స్ధలంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. అయోధ్యలో అందమైన  రామమందిరం నిర్మాణాన్ని… అందరం చేయిచేయి కలిపినిర్మించుకుందామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  ఎన్నో ఏళ్ల వివాదాలకు నేడు పరష్కారం   లభించిందని. కోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్ట్‌కు భూమి అప్పగించడం, ఆలయ నిర్మాణం అన్నీ జరుగుతాయన్నారు. ఇలాగే జరగాలని తాము ఏమీ నిర్దేశించడం లేదని వ్యాఖ్యానించారు. 

రామమందిర నిర్మాణంలో తమవంతు పాత్రను పోషిస్తామని తెలిపారు. వివాదాలన్నీ పక్కన పెట్టాలని తుదితీర్పులో సుప్రీం తెలిపిందన్న విషయాన్ని గుర్తు చేశారు. వివాదం సమసిపోయిందని భావిస్తున్నామని.. గతాన్ని మర్చిపోదామని మోహన్‌ భగవత్‌ పిలుపునిచ్చారు. మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఎక్కడ ఇవ్వాలి, ఎలా అనేది.. సుప్రీం ఆదేశాల ప్రకారం కేంద్రం చూసుకుంటుందన్నారు. మందిరం నిర్మాణమే తమ లక్ష్యమని తెలిపారు. సంఘ్‌ ఎప్పుడూ ఆందోళనలు చేయదని.. జాతి నిర్మాణం మాత్రమే చేస్తుందన్నారు.

 

×