Trains Restoration : ప్రజలకు అందుబాటులో మరికొన్ని రైళ్లు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు.

Trains Restoration : ప్రజలకు అందుబాటులో మరికొన్ని రైళ్లు

Trains restoration

Trains Restoration : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ ఇప్పటికే కొన్ని రూట్లలో రైళ్లను పునరుధ్ధరించింది. తాజాగా మరోసారి పలు మర్గాల్లో రైళ్లను నడిపేందుకు అధికారులు సిధ్ధమయ్యారు. వీటిలో గరీబ్ రథ్‌ స్పెషల్ తాజ్ ఎక్స్‌ప్రెస్, షాన్-ఎ-పంజాబ్, ముంబై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్ట్‌ క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 50కిపైగా రైళ్లను తిరిగి ప్రారంభించనున్నారు. ప్రజలకు ప్రయాణం మళ్లీ చౌకగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని రైల్వేశాఖ మంత్రి పీయూల్‌ గోయల్‌ అన్నారు.

ముంబై సెంట్రల్ నిజాముద్దీన్ ఆగస్ట్‌ క్రాంతి రాజధాని స్పెషల్ శనివారం నుంచి నడుస్తుండగా.. షాజహాన్‌పూర్-సీతాపూర్ సిటీ, సీతాపూర్‌ సిటీ- షాజహాన్‌పూర్‌ రిజర్వుడ్‌ ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ నేటి నుంచి అందుబాటులోకి రానుంది.

లక్నో-వారణాసి ఇంటర్‌సిటీ స్పెషల్ (04270),
వారణాసి-లక్నో ఇంటర్‌సిటీ స్పెషల్ (04269) సోమవారం నుంచి పట్టాలెక్కనున్నాయి.

వారణాసి – ఆనంద్‌ విహార్ (04249)‌ ఈ నెల 8 నుంచి,
ఆనంద్‌ విహార్‌ – వారణాసి (04250‌), గరీబ్‌ రథ్‌ స్పెషల్‌ రైళ్లు ఈ నెల 8వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
మరో గరీబ్‌ రథ్‌ స్పెషల్‌ ఆనంద్‌ విహార్‌ – ముజఫర్‌పూర్‌ ట్రైన్‌ 7 నుంచి నడువనుంది.
ఈ నెల 5 నుంచి న్యూఢిల్లీ – ఝాన్సీ తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ (04062),
ఝాన్సీ – న్యూఢిల్లీ తాజ్‌ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ పట్టాలెక్కనుంది.