Sonia Gandhi: రాహుల్‌తో కలిసి 76వ పుట్టిన రోజు జరుపుకొన్న సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్‌లోనే పర్యటించనున్నారు. తన కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీతో కలిసి వేడుకలు జరుపుకొన్నారు.

Sonia Gandhi: రాహుల్‌తో కలిసి 76వ పుట్టిన రోజు జరుపుకొన్న సోనియా గాంధీ

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం తన 76వ పుట్టిన రోజు జరుపుకొన్నారు. రాజస్థాన్‌లోని రంతంబోర్ నేషనల్ పార్కులో కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి సోనియా తన పుట్టిన రోజు జరుపుకొన్నారు. నేషనల్ పార్కు పరిధిలోని సఫారి జీపులో తిరుగుతూ అక్కడి వన్య మృగాల్ని వీక్షించారు.

Pawan Kalyan: రూల్స్ పవన్ కల్యాణ్‌కేనా? వైసీపీపై ట్విట్టర్లో విరుచుకుపడుతున్న పవన్ కల్యాణ్

పులి, ఇతర జంతువుల్ని చూస్తూ కొంత సమయంపాటు ఉత్సాహంగా గడిపారు. సోనియా గాంధీ పార్కులో పర్యటించినప్పటి ఫొటోల్ని పార్కు నిర్వాహకులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. కాగా, సోనియా గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీ నాలుగు రోజులపాటు రాజస్థాన్‌లోనే పర్యటించనున్నారు. ఇది ఆమె వ్యక్తిగత పర్యటన. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలకు, నేతలకు దూరంగా ఉండనున్నారు.