Yogi Adityanath : యూపీ ప్రభుత్వంలో మార్పుల్లేవ్

కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు.

Yogi Adityanath : యూపీ ప్రభుత్వంలో మార్పుల్లేవ్

Yogi Adityanath

Yogi Adityanath కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు జరగడం లేదని స్పష్టం చేశారు. అవి కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించే మీడియా హెడ్డింగులు మాత్రమేనని యోగి ఆదిత్యనాథ్ ఓ ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు.

బీజేపీ పార్టీ పూర్తిగా కార్యకర్తల నిర్వహణలో నడిపే పార్టీ. ఈ పార్టీలో వారసత్వ రాజకీయాలకు తావు లేదు. అందుకే ఈ పార్టీలో తరుచూ సమావేశాలు జరుగుతుంటాయి. మా పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రతి రెండు నెలలకు ఒకసారి రాష్ట్రానికి వస్తారు. నాలుగు నెలల క్రితమే పార్టీ అధినేత జేపీ నడ్డా వచ్చారు. ఇలా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వీటిని ఆధారంగా చేసుకుని ప్రభుత్వంలో మార్పులు జరుగుతున్నాయి అనడం సరైంది కాదు. జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమని యోగి ఆదిత్యానాథ్‌ అన్నారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు గురించి అడిగిన ప్రశ్నకు..ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని యోగి ఆదిత్యనాథ్ సమాధానమిచ్చారు. 2/3 మెజారిటీతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. తాము కరోనా వైరస్ పైన మాత్రమే కాకుండా పొలిటికల్ ఇన్ఫెక్క్షన్ల పై కూడా పోరాటం చేస్తున్నామన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.