బహిరంగప్రదేశాల్లో ఉమ్మి వేస్తే..రూ. 2 వేలు ఫైన్

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 11:05 PM IST
బహిరంగప్రదేశాల్లో ఉమ్మి వేస్తే..రూ. 2 వేలు ఫైన్

Spitting and tobacco : ప్రపంచాన్ని ఇంకా కరోనా భయపెడుతోంది. వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కూడా కరోనా పాజిటవ్ కేసులు రికార్డవుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో అంతకంతకు వైరస్ విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం…మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేలా కఠిన చర్యలు తీసుకొంటోంది.



కరోనా కేసులు తీవ్రత దృష్ట్యా పలు నిబంధనలు విధిస్తోంది. ఇప్పటికే మాస్క్ ధరించకుండా..బయటకు వచ్చిన వారికి రూ. 2 వేలు ఫైన్ వేస్తామని కేజ్రీవాల్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా…కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా..భౌతిక దూరం పాటించకపోయినా..రూ. 2 వేల చొప్పున జరిమాన విధించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం నోటీఫికేషన్ జారీ చేసింది.



ప్రజల్లో భయం పెరగడానికే గతంలో ఉన్న రూ. 500 ఉన్న జరిమానాను ఏకంగా రూ. 2 వేలకు పెంచేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఆమోదం అనంతరం వైద్య ఆరోగ్య శఆఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు..ఢిల్లీలో ఇంకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం తాజాగా..6 వేల 608 పాజిటివ్ కేసులు రికార్డు కాగా..118 మంది చనిపోయారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5.17 లక్షలకు చేరింది.