Sputnik Lite : త్వరలో భారత్ కి సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్ లైట్”!

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది.

Sputnik Lite : త్వరలో భారత్ కి సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్  “స్పుత్నిక్  లైట్”!

Sputnik Lite

Sputnik lite దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న సమయంలో కేంద్రం శుభవార్త చెప్పింది. ర‌ష్యా అభివృద్ధి చేసిన “స్పుత్నిక్-వీ” వ్యాక్సిన్ వచ్చే వారం నుంచి మార్కెట్ లో అందుబాటులో వస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం తెలిపారు. భారత్​లోకి స్పుత్నిక్​ వ్యాక్సిన్ వచ్చేసింది. వచ్చే వారం మార్కెట్లలో అందుబాటులో ఉంటుందని చేప్పేందుకు సంతోషిస్తున్నాం. అక్కడి నుంచి (రష్యా) వచ్చిన పరిమిత వ్యాక్సిన్ల విక్రయాలు వచ్చే వారం ప్రారంభమతాయని ఆశిస్తున్నాం అని వీకే పాల్ తెలిపారు.

కాగా, దేశంలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గత నెల భారత్ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ర‌ష్యా నుంచి స్పుత్నిక్-వీ టీకాల‌ను భార‌త్‌కు దిగుమ‌తి చేసుకోవ‌డానికి డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబోరేట‌రీస్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో రెడ్డీస్ ల్యాబోరేట‌రీస్ బ్యాచ్‌ల వారీగా టీకాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న‌ది. ఇప్ప‌టికే ఈ నెల 1న తొలి బ్యాచ్ టీకాలు భార‌త్‌కు వ‌చ్చాయి. స్పుత్నిక్-వీ టీకా రెండో బ్యాచ్ కూడా రేపు భార‌త్‌కు చేరుకోనుంది.

ప్రస్తుతం కేంద్ర నేషనల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో రెండు కోవిడ్ వ్యాక్సిన్ లు కోవిషీల్డ్,కోవాగ్జిన్ లు భాగంగా కాగా,తర్వలోనే రష్యా స్పుత్నిక్ వీ కూడా ఈ డ్రైవ్ లో భాగం కానుంది. స్పుత్నిక్-వీ..రెండు డోసుల వ్యాక్సిన్. మొదటి డోస్ తీసుకున్న మూడు వారాల తర్వాత రెండో డోస్ తీసుకోవాలి. మొదటి మరియు రెండవ డోసులో యాంటిజెన్‌లు ఒకదానికొకటి భిన్నంగా ఉండటం విశేషం. ఇతర వ్యాక్సిన్లలో రెండు డోసులు ఒకే విధంగా ఉంటాయి.

మరోవైపు, రష్యా అభివృద్ధి చేసిన సింగిల్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ “స్పుత్నిక్ లైట్”…కరోనావైరస్ సంక్రమణ నుండి ఏ మేరకు రక్షణ కల్పిస్తుందనే దానిపై భారతదేశం పరిశీలిస్తుందని వీకే పాల్ తెలిపారు. “స్పుత్నిక్ లైట్” విషయంలో వారు (డెవలపర్లు) మొదటి మోతాదు సరిపోతుందని చెప్తున్నారు. మేము ఈ వాదనలను పరిశీలిస్తున్నాము. మేము దాని డేటా మరియు ఇమ్యునోజెనిసిటీ పరిశీలిస్తాము. మరింత సమాచారం రావాల్సి ఉంది అని వీకే పాల్ చెప్పాడు. భారత్ లో స్పుత్నిక్ వీ లైట్ వ్యాక్సిన్ వినియోగంపై అడిగిన ప్రశ్నకు…వ్యాక్సిన్ డెవలపర్లు చేస్తున్న వాదనలు నిజమైతే ఇది భారత్ లో వ్యాక్సినేషన్ వేగం పెంచడంలో రెట్టింపు సాయం చేస్తుందని సమాధానమిచ్చారు.