Stock Market : వరుసగా 2వ రోజూ భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు, లాభపడింది అదొక్కటే..

రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో

Stock Market : వరుసగా 2వ రోజూ భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు, లాభపడింది అదొక్కటే..

Stock Market

Stock Market : రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 61,259కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 18,266కి దిగజారింది. ఈరోజు టెలికాం సూచీ మినహా ఇతర సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి. ఒక్క టెలికాం మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. యూరప్ సూచీలు సైతం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

Baldness : బట్టతల సమస్యతో బాధపడుతున్నారా…ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?..

సెన్సెక్స్‌ 30 షేర్లలో 21 నష్టపోయాయి. టైటాన్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, ఎంఅండ్‌ఎం, సన్‌ఫార్మా, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఈ కుదుపులోనూ భారతీ ఎయిర్‌టెల్‌ ఏకంగా 4 శాతం మేర లాభపడడం విశేషం. ఎస్బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

Exercises : అతి వ్యాయామాలు అనర్ధదాయకమా?

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
* భారతి ఎయిర్ టెల్ (4.03%)
* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.35%)
* ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.56%)
* బజాజ్ ఫైనాన్స్ (0.46%)
* యాక్సిస్ బ్యాంక్ (0.44%).

టాప్ లూజర్స్:
* టైటాన్ కంపెనీ (-2.97%)
* హిందుస్థాన్ యూనిలీవర్ (-2.63%)
* ఎన్టీపీసీ (-2.27%)
* ఎల్ అండ్ టీ (-2.13%)
* పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.12%).