ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

ఆర్టీసీ సమ్మె, నిలిచిపోనున్న బస్సులు!

bus strike

Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అవుతున్న దృష్ట్యా ప్రజలు ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదులెండి…పొరుగున్న ఉన్న తమిళనాడు రాష్ట్రంలో. వేతనాల పెంపుదల, ప్రావిడెంట్ ఫండ్, రిటైర్డ్ కార్మికుల బకాయిలు, రవాణా శఆఖ మొత్తం పరిస్థితుల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని, బడ్జెట్ లో రవాణా సంస్థ నష్టాలను కవర్ చేయాలని యూనియన్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రవాణా సంస్థలు ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయని, సంఘాలు చేసిన డిమాండ్లను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందంటున్నారు అధికారులు.

9 యూనియన్లకు చెందిన లక్ష మంది కార్మికులు సమ్మెలో పాల్గొనున్నారని, 80 శాతం ప్రభుత్వ బస్సులు 2021, ఫిబ్రవరి 25వ తేదీ గురువారం నుంచి రోడ్డెక్కవని కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ బస్సులు 80 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నందున ప్రతిరోజు కనీసం రూ. 10 నుంచి రూ. 16 కోట్ల వరకు నష్టం వస్తోందని, 13 వేతన ఒప్పందం 2019 సెప్టెంబర్ 1తో ముగుస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి సమయంలో సమ్మెకు దిగడం అన్యాయమని తెలిపారు.
లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (ఎల్పీఎఫ్), ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ), హింద్ మజ్దూర్ సభ (హెచ్‌ఎంఎస్), ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)..మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌తో పాటు ఎనిమిది రాష్ట్ర రవాణా సంస్థలు పాల్గొంటున్నాయి.