Uttar Pradesh : యూపీ ప్రభుత్వ స్కూల్ లో 18మంది బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు

విద్యార్థినులను వేధించిన కేసులో కంప్యూటర్ టీచర్ కు మద్దతు ఇచ్చిన ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ ను సస్పెండ్ చేశారు. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Uttar Pradesh : యూపీ ప్రభుత్వ స్కూల్ లో 18మంది బాలికలపై టీచర్ లైంగిక వేధింపులు

Teacher Harassment Girls

Teacher Harassment Girls : ఉత్తరప్రదేశ్ లో విద్యార్థినులను వేధించిన ఓ ప్రభుత్వ స్కూల్ టీచర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 18మంది విద్యార్థినులతో సదరు టీచర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు నిర్దారించారు. విద్యార్థినులను వేధించిన కేసులో కంప్యూటర్ టీచర్ కు మద్దతు ఇచ్చిన ప్రిన్సిపాల్, అసిస్టెంట్ టీచర్ ను సస్పెండ్ చేశారు. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్, ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

యూపీలోని షాహజహాన్ పూర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఘటనలో తిల్హార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 18మంది బాలికలకు మంగళవారం ఎక్స్ రే పరీక్షలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Catholic Church : క్యాథలిక్‌ చర్చిలో 5,000ల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు..నిందితుల్లో చర్చి మతపెద్దలు

స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులను కంప్యూటర్ టీచర్ మహమ్మద్ అలీ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతనికి ప్రిన్సిపాల్ అనిల్ పాఠక్, మరో టీచర్ సాజియా మద్దతు ఇచ్చినట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రియాంకా జైన్ వెల్లడించారు.