New Parliament Building: నూతన పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసిన కేంద్రం .. ఓ లుక్కేయండి ..

కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

New Parliament Building: నూతన పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసిన కేంద్రం .. ఓ లుక్కేయండి ..

New Parliament Building

New Parliament Building: కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనం లోపలి ఫొటోలను విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా డీ లిమిటేషన్ల కారణంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగడంతో నూతన పార్లమెంట్ భవనం నిర్మాణం చేపట్టారు.

New Parliament Building

New Parliament Building

కొత్త పార్లమెంట్ భవనం లోపల 888 మంది  పార్లమెంట్ సభ్యులకు, రాజ్యసభలో 384 మంది ఎంపీలకు సీటింగ్ స్థలం ఉంటుంది. అదనపు సీటింగ్ కోసం స్థలం కూడా ఉంది.

New Parliament Building

New Parliament Building

2020 డిసెంబర్ 10న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కేబినెట్ మంత్రులు, వివిధ దేశాల రాయబారుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో కొత్తపార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేశారు.

New Parliament Building

New Parliament Building

నూతన పార్లమెంట్ భవన నిర్మాణ అంచనా వ్యయంతో రూ. 971 కోట్లు. ఈ భవనాన్నిఅన్నిరకాల భద్రతా ప్రమాణాలతో నిర్మాణం చేశారు.

New Parliament Building

New Parliament Building

నూతన పార్లమెంట్ భవనంలో బహిరంగ ప్రాంగణానికి అనుబంధంగా సెంట్రల్ లాంజ్ ఉంది. ఇందులో జాతీయ వృక్షం మర్రి చెట్లు ఉంటుంది.

New Parliament Building

New Parliament Building

నూతన పార్లమెంట్ భవనంపై ప్రతిష్టించిన జాతీయ చిహ్నమైన మూడు సింహాల విగ్రహాన్ని గతేడాది జూలై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

New Parliament Building

New Parliament Building

ఈ నూతన పార్లమెంట్ భవనంలో పెద్ద హాళ్లు, లైబ్రెరీ, సౌకర్యవంతమైన పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి. అత్యంత సాంకేతికతలతో ఈ భవనంలో ఏర్పాట్లు సమకూర్చారు.

New Parliament Building

New Parliament Building

సెంట్రల్ విస్టా రీ డెవలప్ మెంట్ లో భాగంగా నూతన పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇందులో పెద్ద హాళ్లు, లైబ్రరీ, విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు కొన్ని కమిటీ గదులు కూడా ఉన్నాయి. అత్యాధునిక రాజ్యాంగ హాలు ఉంటుంది.

New Parliament Building

New Parliament Building

ఆధునిక భారతదేశపు వైవిధ్యాన్ని ప్రతిబింబించే ప్రాంతీయ కళలు, చేతికళతో చిత్రాలను కొత్త పార్లమెంట్ భవనంలో పొందుపర్చనున్నారు.

New Parliament Building

New Parliament Building

ఈ భవనంలో సురక్షితమైన, సమర్థవంతమైన కమ్యూనికేషన్ టెక్నాలజీతో అల్ట్రా మోడ్రన్ ఆఫీస్ స్పేస్ ఉంటుంది.

New Parliament Building

New Parliament Building

కొత్త పార్లమెంట్ భవనం 65,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. పార్లమెంట్ సజావుగా సాగేందుకు కొత్త, ప్రస్తుత భవనాలు సమిష్టిగా పనిచేస్తాయని ప్రభుత్వం తెలిపింది.