T. High Court : తెలంగాణ హైకోర్ట్ లో పెరిగిన జడ్జీల సంఖ్య..

తెలంగాణ హైకోర్టుకు జడ్జీల సంఖ్య పెరిగింది. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం చొరవతో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి జస్టిస్‌ ఎన్వీ రమణ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

T. High Court : తెలంగాణ హైకోర్ట్ లో పెరిగిన జడ్జీల సంఖ్య..

T. High Court

Increased number of judges in Telangana HC : తెలంగాణ హైకోర్టుకు జడ్జీల సంఖ్య పెరిగింది. తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం చొరవతో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. ఈనిర్ణయంతో టీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఏకంగా 75శాతానికి పెరిగింది. వీరిలో 32 మంది శాశ్వత జడ్జీలు కాగా, 10 మంది అదనపు జడ్జీలు ఉన్నారు. రెండేళ్లుగా మూలనపడిన హైకోర్టు విజ్ఞప్తిని వెలికితీసి ఆమోదం తెలిపారు సీజేఐ.

తెలంగాణ హై కోర్ట్ లో న్యాయమూర్తుల సంఖ్య పెయించాలని గతంలో ప్రధాని మోడీకి న్యాయ శాఖ మంత్రికి సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్వీ రమణ సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు తీసుకున్న అనంతరం టీ.హైకోర్టుకు జడ్జీ సంఖ్య పెంచుతు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీల నియామకానికి అనుమతించారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టుకు ప్రస్తుతం కేటాయించిన 24 మంది న్యాయమూర్తుల స్థానంలో 42 మంది న్యామూర్తులను నియమించాలని కోరారు.

కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోందని, ప్రజలకు సత్వర న్యాయం జరగాలంటే జడ్జిల సంఖ్యను పెంచాలని కోరగా..జస్టిజ్ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎట్టకేలకు పెరిగింది. సీజేఐ ఎన్వీ రమణ కీలక నిర్ణయంతో 24మంది జడ్జీల సంఖ్య 42కు పెరిగింది. దీంతో ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ హైకోర్టు సమస్య తీరినట్లు అయ్యింది. ఈపెంపుతో కేసుల పరిష్కారం త్వర త్వరగా అవుతాయో లేదో చూడాలి.