Health Department Warning : కరోనా ఇంకా పోలేదు.. భ్రమలో బతకొద్దు.. ఏ క్షణమైనా విజృంభించొచ్చు!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లుగా లేదు. ఇప్పటికి దేశంలో 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మన మధ్య నుంచి పోయిందని భ్రమపడి నిబంధనలు మరచి ప్రవర్తించొద్దని హెచ్చరించింది.

Health Department Warning : కరోనా ఇంకా పోలేదు.. భ్రమలో బతకొద్దు.. ఏ క్షణమైనా విజృంభించొచ్చు!

Health Department Warning

Health Department Warning : దేశంలో కరోనా సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినట్లుగా లేదు. ఇప్పటికి దేశంలో 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా మన మధ్య నుంచి పోయిందని భ్రమపడి నిబంధనలు మరచి ప్రవర్తించొద్దని హెచ్చరించింది.

ఉత్తరాఖండ్ లోని కెమ్టీ జలపాతం వద్ద వెలుగు చూసిన దృశ్యాలు, మనాలి చిత్రాలను చూసి ఆందోళ వ్యక్తం చేసింది. జలపాతంలో యాత్రికుల తీరు కరోనాకు మరోసారి ఆహ్వానం పలుకుతున్నట్లు ఉందని అసహనం వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా డెల్టా వైరస్ విజృభిస్తున్న తీరును గుర్తుచేసింది.

బంగ్లాదేశ్ లో కేసుల సంఖ్య దశల వారీగా పెరుగుతుందని, మొదటి వేవ్ లో వచ్చిన కేసులకు మూడవ వేవ్ లో వచ్చిన కేసులకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని.. మూడవ వేవ్ లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. కరోనా కట్టడికి బంగ్లాదేశ్ లాక్ డౌన్ విధించిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక కేరళ, మహారాష్ట్రలో నమోదవుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఈ రెండు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని తెలిపింది. దేశ వ్యాప్తంగా 43,393 కేసులు నమోదు కాగా.. కేరళలో ఆ సంఖ్య 13,772 కేసులు మహారాష్ట్రలో 9,083 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటికే డెల్టాప్లస్ ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా రకం కపా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు కేసులు వెలుగుచూశాయి. కొత్త రకం లామ్డా రకాన్ని ఇంకా భారత్‌లో గుర్తించలేదని కేంద్రం వెల్లడించింది. మరో వైపు టీకా కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దేశంలో 37 కోట్లమంది మొదటి డోస్ టీకా తీసుకున్నారు.