Corona Cases : భారత్ లో మళ్లీ కరోనా పంజా.. కొత్తగా ఎన్ని కేసులంటే!

దేశంలో ఇప్పటివరకు 4,30,60,086 కేసులు, 5,22,223 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.75 శాతం కరోనా రికవరీ రేటు ఉంది.

Corona Cases : భారత్ లో మళ్లీ కరోనా పంజా.. కొత్తగా ఎన్ని కేసులంటే!

Corona

Corona Cases : భారత్ లో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. దేశంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 2,541 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 30 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 16,522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.04 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు 4,30,60,086 కేసులు, 5,22,223 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.75 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. నిన్న కరోనా నుంచి 1,862 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 4,25,21,341 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Narendra Modi: పెరుగుతున్నకరోనా.. సీఎంలతో మోదీ మీటింగ్

భారత్ లో 465 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187.71 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 3,64,210 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 187,71,95,781 డోసుల టీకాలు అందజేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 83.50 కోట్లు దాటింది. గడిచిన 24 గంటల్లో 3,02,115 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83,50,19,817 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3357 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.  కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1431 ప్రభుత్వ లాబ్స్, 1926 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.

India Covid : కరోనా మనల్ని వదలదా ? ఫోర్త్ వేవ్‌‌కు సంకేతం!

దేశంలో నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలకు వెంటనే కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచనలు చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబై సహా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఆంక్షలు విధించారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, నాలుగో దశ ప్రభావం, వ్యాక్సినేషన్, సహా కోవిడ్ నియంత్రణ చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సైతం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని..పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.