World Password Day 2023 : మీ పాస్ వర్డ్ భద్రంగా ఉండాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..

మీరు పెట్టుకున్న పాస్ వర్డ్ గుర్తు పెట్టుకుంటున్నారా? అసలు స్ట్రాంగ్‌గా పెట్టుకున్నారా? భద్రంగా ఉందా? లేదంటే ఓసారి చెక్ చేసుకోండి. మీ పాస్ వర్డ్ ఎలాగైనా కనిపెట్టేసే సైబర్ కేటుగాళ్లు మీ చుట్టూనే ఉంటారు. ఆ తరువాత తల పట్టుకునే కన్నా ముందుగా జాగ్రత్తలు పాటించండి. ఈరోజు 'వరల్డ్ పాస్ వర్డ్ డే'

World Password Day 2023 : మీ పాస్ వర్డ్ భద్రంగా ఉండాలంటే జస్ట్ ఇలా చేయండి చాలు..

 World Password Day 2023

World Password Day 2023 : చేతిలో సెల్ ఫోన్ లేకపోతే ఏ పనీ చేయలేం. ప్రతి అవసరానికి దానిపై ఆధారపడతాం. ఫోటోలు, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆధార్, పాన్ కార్డ్ అన్నీ వివరాలు ఫోన్‌లో పెట్టుకుంటాం. పాస్ వర్డ్ సరిగ్గా పెట్టుకోలేదనుకోండి.. మీ వివరాలన్నీ కనిపెట్టేసి మీ డబ్బులు కూడా దోచేసే ఆన్ లైన్ కేటుగాళ్లు కాపు కాసుకుని ఉంటారు. ఇంతకీ మీ పాస్ వర్డ్ స్ట్రాంగ్ గా పెట్టుకున్నారా.. ? ఈరోజు ‘వరల్డ్ పాస్ వర్డ్ డే’. ఏటా మే నెల మొదటి గురువారం ఈ డేని నిర్వహిస్తారు. మన పాస్ వర్డ్ భద్రంగా ఉందో లేదో అవగాహన కల్పించడం కోసం ఏటా ఈ డేని జరుపుతుంటారు.

షాకిచ్చిన  ఫేస్ బుక్: యూజర్ల పాస్ వర్డ్ మాకు తెలుసు  

చాలామంది పాస్ వర్డ్ పెట్టుకుంటారు. వెంటనే మర్చిపోతుంటారు. ఫోన్లలో కూడా పాస్ వర్డ్‌ని సేవ్ చేసుకుంటారు. పొరపాటున మీ ఫోన్ పోయిందే అనుకోండి.. కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయబడ్డ పాస్ వర్డ్‌తో మీ డీటెయిల్స్ తెలుసుకోవడం మోసగాళ్లకు మరింత సులభం. పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేటపుడు అక్షరాలు, నంబర్లు పొడవుగా ఉండేలా చూసుకోవాలి. వీటిని క్రియేట్ చేయడం, గుర్తు పెట్టుకోవడం కష్టంగానే ఉన్నా భద్రంగా ఉండాలంటే జాగ్రత్తలు అవసరం.

 

వరల్డ్ పాస్ వర్డ్ డే సందర్భంగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో సరదా మీమ్స్ తో సందడి చేస్తూనే మరోవైపు పాస్ వర్డ్ విషయంలో ఎంత సీరియస్ గా ఉండాలో సలహా ఇస్తున్నారు. నాగాలాండ్ మినిస్టర్ టెమ్జెన్ ఇమ్నా అలాంగ్ ‘GirlfriendName123@’ అని పాస్ వర్డ్ పెట్టుకుంటే వెంటనే మార్చుకోండి.. మీ పాస్ వర్డ్ సేఫ్ గా పెట్టుకోండి’.. అంటూ చమత్కారంగా పోస్ట్ చేశారు.

AI Crack Password : ఏఐ(AI)తో జాగ్రత్త.. మీ పాస్‌వర్డ్ ఏదైనా క్షణాల్లో పసిగట్టేయగలదు.. సేఫ్‌గా ఉండాలంటే తప్పకుండా ఇలా చేయండి!

ఇక ఢిల్లీ పోలీసులు కూడా హ్యాకర్లకు ఛాన్స్ ఇచ్చేలా పాస్ వర్డ్ పెట్టుకోవద్దని సూచించారు. టెక్ దిగ్గజం గూగుల్ కూడా సురక్షితమైన పాస్ వర్డ్ లు పెట్టుకోమని సూచిస్తూనే 2001 లో వచ్చిన అక్షయ్ కుమార్, బాబీడియోల్‌ల అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించిన ఫోటోని షేర్ చేసింది. మొత్తానికి పాస్ వర్డ్ భద్రత గురించి జాగ్రత్తలు చెబుతూనే మరోవైపు ఫన్నీ మీమ్స్‌తో పలువురు సోషల్ మీడియాలో సందడి చేశారు.